IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలం షార్ట్ లిస్ట్ రిలీజ్.. మెగా వేలంలో 13 ఏళ్ల కుర్రాడు..
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది.

13 year old Vaibhav Suryavanshi prodigy becomes youngest player in IPL Auction list
IPL Auction 2025 : ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతోంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ నెల 24, 25 తేదీల్లో మెగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేలం కోసం 1574 మంది ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలోంచి 574 మంది ఆటగాళ్లతో కూడిన షార్ట్ లిస్ట్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఇందులో 366 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు కాగా 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
వీరిలో రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో 81 మంది ఆటగాళ్లు ఉన్నారు. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, సిరాజ్ తదితరులు ఈ విభాగంలో ఉన్నారు. రూ.1.5 కోట్ల కనీస ధరతో 27 మంది, రూ.1.25 కోట్లతో 18 మంది, రూ కోటితో 23 మంది వేలానికి సిద్ధం అయ్యారు.
SA vs IND : తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత శతకం.. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం చూశారా..?
కాగా.. ఈ జాబితాలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకోవడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇతడి కనీస ధర రూ.30లక్షలు. ఐపీఎల్ మెగా వేలంలో బరిలో ఉన్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
వైభవ్ సూర్యవంశీ ఎవరు?
13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ స్వస్థలం బీహార్. దేశవాలీ క్రికెట్‌లో ఆ రాష్ట్ర రంజీ టీమ్ తరుపున ఆడుతున్నాడు. 12 ఏళ్ల 284 రోజుల వయసులోనే అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. అండర్ 19 ఆసియాకప్ టోర్నీకి ఎంపికయ్యాడు. యూత్ వన్డే కప్‌లో ఆస్ట్రేలియాపై శతకంతో రాణించాడు. సంచనాలు సృష్టిస్తున్న అతడిని ప్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
India Vs South Africa: అయ్యో.. సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి.. వీడియో వైరల్
🚨 13 YEAR OLD VAIBHAV SURYAVANSHI IS THE YOUNGEST TO BE SHORTLISTED…!!! 🚨 pic.twitter.com/91uuXmzQRc
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2024