SA vs IND : తెలుగు తేజం తిలక్ వర్మ అద్భుత శతకం.. కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనందం చూశారా..?
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టాడు.

VVS Laxman goes berserk as Tilak Varma hits stunning ton in Johannesburg T20I
SA vs IND : టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా గడ్డ పై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లోనూ సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో శతకాలు బాదిన రెండో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 47 ఎదుర్కొన్న తిలక్ వర్మ 9 ఫోర్లు, 10 సిక్సర్లు బాది 120 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లోనూ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
22 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన తిలక్ మరో 19 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. మొత్తంగా 41 బంతుల్లోనే మూడు అంకెల మార్క్ చేరుకున్నాడు. తిలక్ వర్మ సెంచరీ చేయగానే టీమ్ఇండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ఆనందంతో చప్పట్లు కొడుతూ కనిపించాడు. తిలక్ వర్మ హైదరాబాద్‌కు చెందిన సంగతి తెలిసిందే. ఇక లక్ష్మణ్ కూడా తెలుగు ఆటగాడు కావడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తిలక్ శర్మతో పాటు సంజూ శాంసన్ (56 బంతుల్లో 109 నాటౌట్) శతకం బాదడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 283 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో 18.2 ఓవర్లలో 148 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. దీంతో భారత్ 135 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
India Vs South Africa: అయ్యో.. సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి.. వీడియో వైరల్
The TV show yet again for #TeamIndia 💯
Take a bow, Tilak Varma! 🔥
Catch LIVE action from the 4th #SAvIND T20I on #JioCinema, #Sports18, and #ColorsCineplex! 👈#JioCinemaSports pic.twitter.com/HUbadVPoRc
— JioCinema (@JioCinema) November 15, 2024