India Vs South Africa: అయ్యో.. సంజూ కొట్టిన సిక్స్‌కు కన్నీరు పెట్టుకున్న యువతి.. వీడియో వైరల్
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం రాత్రి జోహన్నెస్బర్గ్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

Sanju Samson
Sanju Samson : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం రాత్రి జోహన్నెస్బర్గ్ వేదికగా చివరి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్), సంజూ శాంసన్ (109 నాటౌట్) సిక్సర్ల మోత మోగించారు. దీంతో భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 283 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read: Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే
ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ కొట్టిన ఒక సిక్సర్ మైదానంలో మహిళా అభిమాని కంట కన్నీరు పెట్టింది. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన సంజూ.. మొదటి నుంచి సిక్సులు, ఫోర్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 10వ ఓవర్లో శాంసన్ తొలి బంతికి సిక్సర్ కొట్టి తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్కరం వేసిన ఈ ఓవర్ రెండో బంతికి లాంగాన్ దిశగా మరో సిక్సర్ కొట్టాడు. ఆ బాల్ కాస్త గ్రౌండ్ లో మ్యాచ్ ను వీక్షిస్తున్న మహిళ దవడకు తగిలింది. బంతి బలంగా తాకడంతో నొప్పికి తట్టుకోలేక ఆమె కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఆమెకు ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చారు.
తాను కొట్టిన సిక్స్ కారణంగా యువతికి గాయం కావడంతో.. వెంటనే సంజూ ఆ యువతికి క్షమాపణలు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సిక్సులు, ఆరు ఫోర్లు ఉన్నాయి.
🚨 SANJU SAMSON SIX HITTING A FAN IN THE STADIUM…!!! 🚨pic.twitter.com/VmKyPf39dw
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 15, 2024