Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే

రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు మరో ఐదు రోజులు సమయం ఉండటంతో మొదటి టెస్టు నాటికి ఆస్ట్రేలియా చేరుకునే అవకాశాలు..

Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే

Rohit Sharma his wife Ritika Sajdeh (File Photo)

Updated On : November 16, 2024 / 7:44 AM IST

Rohit Sharma Wife Ritika Sajdeh: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. ఆయన సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ – రితికా సజ్దేకు 2015 డిసెంబర్ 13న వివాహం జరిగింది. వీరికి 2018 డిసెంబర్ 30న సమైరా అనే కుమార్తె జన్మించింది. తాజాగా శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ ఆస్పత్రిలో రుతికా మగ బిడ్డకు జన్మనిచిచ్చింది.

Also Read: Tilak Varma : అద‌ర‌గొట్టిన తిల‌క్ వ‌ర్మ‌.. టీ20ల్లో వ‌రుస‌గా రెండో శ‌త‌కం..

బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. తొలి టెస్టు పెర్త్ లో ఈనెల 22న ప్రారంభం కానుంది. ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు ఆస్ట్రేలియా చేరుకొని ప్రాక్టీస్ లో నిమగ్నమయ్యారు. రోహిత్ శర్మ తన సతీమణి రితికా సజ్దే గర్భిణి కావటంతో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లలేదు. ప్రస్తుతం రితికా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో రోహిత్ ఆస్ట్రేలియా టూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ కు మరో ఐదు రోజులు సమయం ఉండటంతో రోహిత్ మొదటి టెస్టు నాటికి ఆస్ట్రేలియా చేరుకునే అవకాశాల ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ మొదటి టెస్టుకు హాజరుకాకపోయినా రెండో టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండనున్నాడు.

 

భారత జట్టుకు ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఎంతో కీలకమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరాలంటే ఈ సిరీస్ లో ఐదు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించాల్సి ఉంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ లాంటి కీలక ప్లేయర్ జట్టుకు ఎంతో అవసరం. ఈ క్రమంలో రోహిత్ మొదటి టెస్టు నాటికి ఆస్ట్రేలియాలో జట్టులో చేరుతాడని తెలుస్తోంది. ఒకవేళ మొదటి టెస్టుకు రోహిత్ గైర్హాజరైతే జస్ర్పీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా పెర్త్ లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.