SA vs IND : అనుకోకుండా టీమ్ఇండియా క్యాప్‌ను తొక్కిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తరువాత ఏం చేశాడో తెలుసా?
సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యంగ్ ఇండియా అదరగొట్టింది.

SA vs IND 4th t20 Suryakumar Yadav Kisses Cap After Accidentally Stepping On It
SA vs IND : సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని యంగ్ ఇండియా అదరగొట్టింది. దక్షిణాప్రికాతో జరిగిన నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌ను 3-1తేడాతో కైవసం చేసుకుంది. శుక్రవారం జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 135 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజూ శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లు )లు విధ్వంసకర శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరగులకే కుప్పకూలింది.
ఇక ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓ వికెట్ పడిన సందర్భంలో భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో రింకూ సింగ్ క్యాప్ నేలపై పడిపోయింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చూడకుండా దానిపై అడుగుపెట్టాడు. అయితే.. గ్రహించిన వెంటనే సూర్య అడుగు తీసి వేశాడు. సంబరాలను మధ్యలోనే ఆపి.. నేలపై పడి ఉన్న క్యాప్‌ను అందుకున్నాడు. గౌరవంగా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. తిరిగి రింకూ సింగ్‌కు క్యాప్‌ను అందించాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు సూర్యకుమార్ యాదవ్‌ను ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram