‘మర్డర్’ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

  • Publish Date - November 6, 2020 / 11:18 AM IST

Murder Movie Release : మర్డర్ చిత్రం విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా రిలీజ్ పై నల్లగొండ కోర్టు ఇచ్చిన స్టేను హైకోర్టు కొట్టేసింది.



సినిమాలో ప్రణయ్, అమృత, మారుతీరావు పేర్లు, ఫొటోలు వాడకూడదని షరతు విధించింది.

హైకోర్టు షరతులకు మర్డర్ చిత్ర యూనిట్ ఇప్పటికే హామీ ఇచ్చింది. ప్రణయ్, అమృత పేర్లు వాడబోమని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.



అమృత, మారుతి రావుల కథ ఆధారంగా మర్డర్ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మర్డర్ అని పేరు పెట్టారు.



రామ్‌ గోపాల్‌ వర్మ సమర్పణలో నిర్మాతలుగా నట్టి కరుణ, నట్టి కరుణ క్రాంతి, ఆనంద్‌ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. మారుతి రావు పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ నటించారు.