Anjali : అంజలి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా.. ఈ ఇయర్ హ్యాట్రిక్ కొడుతుందా? ‘గేమ్ ఛేంజర్’తో సహా..

అంజలి ఈ సంవత్సరం మూడు సినిమాలతో రాబోతుంది.

Telugu Actress Anjali Come Back in Telugu with Geethanjali Malli Vachindi Gangas Of Godavari Game Changer Movies

Anjali : తెలుగమ్మాయి అంజలి తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది. అడపాదడపా కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. తెలుగులో మెయిన్ లీడ్ గా 2017లో చిత్రాంగద సినిమాతో కనపడింది. ఆ తర్వాత ఇప్పటివరకు మెయిన్ లీడ్ గా తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో వకీల్ సాబ్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర, మాచర్ల నియోజకవర్గంలో ఓ ఐటెం సాంగ్ చేసింది.

ఇప్పుడు అంజలి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాతో రాబోతుంది. పదేళ్ల క్రితం అంజలి చేసిన హారర్ కామెడీ సినిమా గీతాంజలికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ రిలీజ్ చేసి నవ్వించి భయపెట్టారు. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా అంది. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం.

అంజలి ఈ సంవత్సరం మూడు సినిమాలతో రాబోతుంది. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ వచ్చింది కామెడీ హారర్ సినిమాతో రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs of Godavari) సినిమాతో రాబోతుంది. విశ్వక్ వరుస ఫామ్ లో ఉండటంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ కాకుండా ఓ ముఖ్య పాత్ర చేస్తుంది. ఇక ఆ తర్వాత గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్(Game Changer) పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కి భార్య పాత్రలో కనిపిస్తుందని సమాచారం.

Also Read : Anjali : గేమ్ ఛేంజర్ షూట్‌లో అంజలికి గాయం.. అయినా వచ్చి వేరే సినిమా కోసం ఐటెం సాంగ్..

ఈ సంవత్సరం ఇలా మూడు సినిమాలతో అంజలి చాలా ఏళ్ళ తరవాత తెలుగులో వరుసగా వస్తుండటంతో ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొడుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలతో తెలుగులో అంజలి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అనుకుంటున్నారు. ఇక అంజలి నటించిన ఈ మూడు సినిమాలు కూడా G లెటర్ తోనే మొదలవ్వడం గమనార్హం. మరి ఈ మూడు సినిమాలు అంజలి కెరీర్ కి ఏ రేంజ్ బూస్ట్ ఇస్తాయో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు