telugu actress Surekhavani visited tirumala venkateswara swamy temple video gone viral
Surekhavani : ప్రముఖ తెలుగు నటి సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా యూసేజ్ పెరిగిన తరువాత.. అక్కడ యాక్టీవ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోలు, రీల్స్, డ్యాన్సులతో బాగానే వైరల్ అవుతున్నారు. సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రీత సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. దీంతో నెట్టింట వీరిద్దరికి ఫాలోయింగ్ బాగానే ఉంది.
కాగా నేడు జనవరి 8న సురేఖ వాణి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నడక దారిన శ్రీవాణి శ్రీవారిని చేరుకున్నారు. అలాగే శ్రీవారికి తన తలనీలాలను కూడా అర్పించారు. అనంతరం తోటి భక్తులతో కలిసి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత అక్కడ ఫోటోలు అడిగినవారికి ఫోటోలు ఇచ్చి వారిని సంతోష పరిచారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also read : OG Movie : OG ఎప్పటికీ మాదే.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన డీవీవీ సంస్థ
ఇది ఇలా ఉంటే, సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా త్వరలోనే సినిమాలోకి రాబోతుందని టాక్ వినిపిస్తుంది. అందుకనే తల్లితో కలిసి సోషల్ మీడియాలో సందడి చేస్తూ, ఆమెతో పాటు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి వస్తుంది. మరి సుప్రీత ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.