Drama Juniors Season 7 : డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి ఆడిషన్స్ ఓపెన్.. కావాల్సిన అర్హత అల్లరి..

డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి ఆడిషన్స్ ఓపెన్ చేశారు. ఇక ఈ ఆడిషన్స్ కి కావాల్సిన అర్హత అల్లరి..

Drama Juniors Season 7 : డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి ఆడిషన్స్ ఓపెన్.. కావాల్సిన అర్హత అల్లరి..

Telugu Drama Juniors Season 7 audition call details

Drama Juniors Season 7 : పిల్లల్లోని టాలెంట్ ని చిన్నతనంలో గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ‘జీ తెలుగు’.. డ్రామా జూనియర్స్ వంటి ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంని రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో మూడేళ్ళ వయసు నుంచి పదమూడేళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల్లోని టాలెంట్ ని అందరికి తెలియజేసేలా రన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే సక్సెస్ ఫుల్ ఆరు సీజన్స్ ని పూర్తీ చేసుకున్న ఈ ప్రోగ్రాం.. ఇప్పుడు ఏదో సీజన్ కి సిద్దమవుతుంది.

ఈక్రమంలోనే 7వ సీజన్ కోసం ఆడిషన్ కాల్ రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ గా ఎదగనీకి జిందగీ ఇచ్చిన ఛాన్స్ వదులుకోకండి.. అంటూ డ్రామా జూనియర్స్ కొత్త సీజన్‌కి ఆడిషన్ కాల్ ఇచ్చారు. ఈ ఆడిషన్ కి 3 నుండి 13 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు అనుమతి ఉంది. ఇక ఈ ఆడిషన్ లో పాల్గొనడానికి మీ పిల్లలకు.. IAS, IPS లాంటి పెద్ద పెద్ద అర్హతలు అవసరం లేదు. కొంచెం అల్లరి, కామెడీ టైమింగ్, అలాగే ఆటలు పాటలు లాంటి టాలెంట్స్ ఉంటే చాలు.

Also read : NTR : ఆ సినిమాకి సీక్వెల్ తీసుకు రావడం కోసం.. ఎన్టీఆర్ ఇంటిముందు నిరాహార దీక్ష చేస్తా.. కోన వెంకట్

హైదరాబాద్ అమీర్ పేట్ లో ఉన్న శ్రీ సారథి స్టూడియోస్ లో ఈ ఆడిషన్స్.. ఏప్రిల్ 7 జరగబోతున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరగబోతున్నాయి. మరి మీ చిన్నారుల్లో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయడం కోసం.. ఈ అవకాశాన్ని ఉపయోగించేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే 9100054301 నెంబర్ కి కాల్ చేయొచ్చు అని తెలియజేసారు.

Telugu Drama Juniors Season 7 audition call details