టాలీవుడ్‌లో సమ్మె సైరన్ మోగింది. సినీ కార్మికులు వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో సమ్మెకు పిలుపునిచ్చారు. నేటి నుంచి షూటింగ్ బంద్ చేయాలని ఫిలిం ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో ఈ రోజు నుంచి సినిమా షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఈక్రమంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక ప్రకటన విడుదల చేసింది.
“ప్రియమైన నిర్మాతలకు.. ఫెడరేషన్ పక్షపాతంగా 30 శాతం వేతనాలు పెంపునకు డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. నైపుణ్యం ఉన్నవారికి, లేని వర్కర్లకు మనం ఇప్పటికే కనీస వేతనాల కంటే ఎంతో ఎక్కువ చెల్లిస్తున్నాం. ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మె కారణంగా నిర్మాణంలో ఉన్న చిత్రాలకు భారీ నష్టం కలుగుతుంది.
Sukumar Daughter Sukriti Veni : సుకుమార్ కూతురు నేషనల్ అవార్డు విన్నింగ్ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
చాలా దశాబ్దాలుగా ఫెడరేషన్ సభ్యులతో కలిసి పని చేస్తున్న మనం ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం. ఈ సమస్యకు పరిష్కారం సాధించేందుకు ఛాంబర్ సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతోంది. నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా చాంబర్ జారీ చేసే మార్గనిర్దేశాలను కచ్చితంగా అనుసరించాలని తెలియజేస్తున్నాం. శాశ్వత పరిష్కారం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం మనమంతా ఐక్యతతో ఉండాలి.” అని ఓ ప్రకటనను విడుదల చేసింది.
Telugu Film Chamber of Commerce take on Federation demand #TFCC #Tollywood pic.twitter.com/51ZovwizK1
— Telugu Film Producers Council (@tfpcin) August 3, 2025