Jani Master
Jani Master : నేడు ఉదయం ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనని లైంగికంగా వేధించాడని, మతం మారి పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని, వర్క్ పరంగా కూడా ఇబ్బంది పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసు టాలీవుడ్ లో సంచలనం రేపింది.
ఈ నేపథ్యంలో కొందరు బాధిత మహిళా కొరియోగ్రాఫర్ ఫోటోలు, వీడియోలు వాడుతుండటంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను విడుదల చేసింది.
Also Read : Jani Master : జానీ మాస్టర్‌కు షాకిచ్చిన జనసేన పార్టీ..
ఈ లేఖలో.. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి కూడా ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ దాన్ని లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ కు సిఫార్సు చేసింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి FIR నమోదు చేసారని తెలిసింది. ఈ క్రమంలో బాధితుల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను అభ్యర్ధిస్తున్నాము. సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క ముసుగులు లేని ఫొటోగ్రాఫ్ లను మరియు వీడియోలను ఉపయోగించవద్దు అని, ఎవరైనా అలా వాడితే వెంటనే తీసివేయమని అందరిని అభ్యర్ధిస్తున్నాము అని తెలిపారు.