Telugu Film Producer Council Elections : అధ్యక్ష పోరులో దిల్ రాజు మద్దతుదారుడి గెలుపు.. ఎన్ని ఓట్లు ఆదిక్యమో తెలుసా?

నేడు (ఫిబ్రవరి 19) తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరగగా, రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దిల్ రాజ్ తన మద్దతుని దామోదర ప్రసాద్ కు తెలియజేయగా, సి కళ్యాణ్ తన మద్దతిని జెమిని కిరణ్ కి వెల్లడించాడు. కాగా..

Telugu Film Producer Council Elections Result

Telugu Film Producer Council Elections : తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ విషయం గురించి గత కొంత కాలంగా టాలీవుడ్ లో పెద్ద రచ్చే జరుగుతుంది. నిర్మాతల మండలి ఎన్నికలు ప్రతి రెండేళ్ళకి ఒకసారి జరగాలి. కానీ కరోనా కారణంగా ఈ ఎలక్షన్స్ వాయిదా పడుతూ వచ్చాయి. కరోనా తగ్గి, సినిమా పనులు ఎప్పటి లాగానే మొదలైనా నిర్మాత మండలి ఎన్నికల పెట్టకపోవడంతో.. ఇటీవల చిన్న నిర్మాతల పెద్ద గొడవే చేశారు. ఇక దీనికి స్పందిస్తూ నిర్మాత సి కళ్యాణ్ ఎన్నికలను ప్రకటించగా, నేడు (ఫిబ్రవరి 19) ఈ ఎలక్షన్స్ జరిగాయి.

Telugu Film Producer Council Elections : ముగిసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్ పోలింగ్.. ఎంతమంది ఓటు వేసారో తెలుసా?

ఇక ఈ ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దిల్ రాజు మద్దతుతో ఒక వర్గం, సి కళ్యాణ్ మద్దతుతో మరో వర్గం. దిల్ రాజ్ తన మద్దతుని దామోదర ప్రసాద్ కు తెలియజేయగా, సి కళ్యాణ్ తన మద్దతిని జెమిని కిరణ్ కి వెల్లడించాడు. ఇక ఈరోజు ఉదయం మొదలైన ఎలక్షన్ పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. నిర్మాతల మండలిలో మొత్తం 1134 ఓటర్స్ ఉండగా, పోలైన ఓట్లు కేవలం 678 మాత్రమే. ఈ ఎన్నికలు కౌంటింగ్ 4 గంటలకు మొదలు కాగా.. అధ్యక్ష పోరులో విజేత ఎవరో రిజల్ట్ వచ్చేసింది.

ఈ పోరులో జెమిని కిరణ్ కి 315 ఓట్లు పడగా, దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు వచ్చాయి. 24 ఓట్లు తేడాతో దిల్ రాజు మద్దతు ఇచ్చిన దామోదర ప్రసాద్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కాగా ఈ పోరులో రెండు ప్యానల్ నుంచి ప్రెసిడెంట్ పాటు సెక్రటరీ పోస్టులతో పాటు, కమిటీ మెంబర్స్ పోస్టులకు కూడా పోటీ జరుగుతుంది. ఒక ట్రెజరర్ పోస్ట్ కి మాత్రం తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి మిగిలిన పోస్టుల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.