Bhoothaddam Bhaskar Narayana Review : ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడా.. సినిమా రివ్యూ ఏంటి..!

టాలీవుడ్ లో చాలా కాలం తరువాత ఆడియన్స్ ముందుకు వచ్చిన డిటెక్టివ్ మూవీ 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. థియేటర్ లో ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంది..?

Bhoothaddam Bhaskar Narayana Review : ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ ఆడియన్స్‌ని థ్రిల్ చేశాడా.. సినిమా రివ్యూ ఏంటి..!

telugu new detective movie Bhoothaddam Bhaskar Narayana Review

Bhoothaddam Bhaskar Narayana Review : డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడు మంచి ఆసక్తి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తో వచ్చిన ప్రతి సినిమా దాదాపు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’. దిష్టిబొమ్మ పురాణాన్ని డిటెక్టివ్ కథకి జత చేసి సినిమా తెరకెక్కించడంతో మూవీ పై ఆడియన్స్ లో మంచి ఆసక్తిని కలుగజేసింది. మరి థియేటర్స్ లో భూతద్ధం భాస్కర్ నారాయణ ఆడియన్స్‌ని ఎలా థ్రిల్ చేశాడా..? సినిమా రివ్యూ ఏంటి..!

సినిమా కథ విషయానికి వస్తే.. తెలుగు, కన్నడ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో అడవుల్లో కొన్నేళ్ల నుంచి ఎవరో ఒక సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ వస్తుంటాడు. మహిళల తలని నరికి, ఆ తల స్థానంలో ఓ దిష్టిబొమ్మని పెడుతుంటాడు. భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) చిన్నప్పుడు తన అన్నయ్య అనుకోకుండా చేయని ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవడం, అవమానంతో ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో తన అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి చిన్నప్పట్నుంచి డిటెక్టివ్ గా మారతాడు. పెద్దయ్యాక ఆ ఊళ్ళోనే డిటెక్టివ్ ఆఫీస్ పెట్టుకొని పోలీసులకు, బయట దొంగతనాల లాంటి కేసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు.

ఆ సమయంలో మళ్ళీ దిష్టిబొమ్మ హత్యలు జరుగుతాయి. ఈ సారి తన పక్కింటి అమ్మాయి, తన ప్రేమికురాలు లక్ష్మి(రాశి సింగ్) అక్క దిష్టిబొమ్మ శవంగా కనపడటంతో ఎలాగైనా ఆ కేసుని సాల్వ్ చేయాలని భాస్కర్ నారాయణ ఫిక్స్ అవుతాడు. భాస్కర్ నారాయణ ఆ కేసుని ఎలా సాధించాడు? హత్యలు చేసి అలా దిష్టిబొమ్మలు ఎందుకు పెడుతున్నారు? ఆ హత్యలకు, దిష్టిబొమ్మ పురాణానికి ఉన్న కనెక్షన్ ఏంటి? అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also read : Operation Valentine : ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ రివ్యూ.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించిన సినిమా..

సినిమా విశ్లేషణ.. డిటెక్టివ్ థ్రిల్లర్స్ అంటే ఆడియన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడంలో భూతద్ధం భాస్కర్ నారాయణ సక్సెస్ అయ్యాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణా కథకి క్రైమ్ థ్రిల్లర్‌కి కనెక్షన్ పెట్టడం.. ఆడియన్స్ కి కొత్త ఫీలింగ్ ని కలిగిస్తుంది. చివరి వరకు సస్పెన్ ని మెయిన్‌టైన్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మలుపులు ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్ దగ్గర కూర్చునేలా చేస్తుంది.

సీరియల్ కిల్లర్ ఎవరు అనే విషయాన్ని చివరి వరకు సస్పెన్స్ గా ఉంచి ఆడియన్స్ ని బాగానే థ్రిల్ చేస్తాయి. ఇక ఈ థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ అండ్ లవ్ ఎమోషన్స్ కూడా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటాయి. హీరో పాత్ర డిటెక్టివ్ అని ఏదో సింపుల్ గా చెప్పేయకుండా.. అతని కథని చిన్నప్పటి నుంచి చెప్పుకు రావడం ఆ పాత్రకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే సెకండ్ హాఫ్ ని చాలా చక్కగా తీర్చిదిద్దుకున్న దర్శకుడు.. ఫస్ట్ హాఫ్ ని మాత్రం కొంచెం ల్యాగ్ చేసాడు అనిపిస్తుంది.

నటీనటులు.. భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి అద్భుతంగా నటించాడు. డిటెక్టివ్ పాత్రలో అదరగొట్టేసాడు. హీరోయిన్ రాశి సింగ్ గ్రామీణ యువతిగా, జర్నలిస్ట్ గా మెప్పించింది. సీనియర్ నటుడు దేవి ప్రసాద్ యాక్టింగ్ మాత్రం క్లైమాక్స్ లో అదరగొట్టేసారు. అరుణ్ కుమార్, షఫీ, వర్షిణి, సురభి సంతోష్, శివ కుమార్.. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు.. శ్రీచరణ్ పాకాల సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లోని పలు థ్రిల్లర్ సినిమాలకు శ్రీచరణ్ స్కోర్ ఎలా అసెట్ అయ్యిందో.. ఈ చిత్రానికి కూడా అంతే పెద్ద అసెట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా అనిపిస్తుంది. విఎఫ్ఎక్స్ అవుట్ పుట్ ఓకే. దర్శకుడు అయితే కొత్తదనం ఉన్న కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఈ భూతద్ధం భాస్కర్ నారాయణ బాగా నచ్చేస్తాడు. ఈ చిత్రానికి 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.