×
Ad

True Lover : ‘ట్రూ లవర్’ మూవీ.. ఆ ఓటిటి అండ్ టీవీ ఛానల్‌లోనే ప్రసారం కాబోతుంది..

‘ట్రూ లవర్’ మూవీ.. తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా లాక్ అయ్యాయి.

Telugu new movie True Lover OTT and TV satellite rights details

True Lover : టాలీవుడ్ దర్శకుడు మారుతి, నిర్మాత SKN కలిసి ‘మాస్ మూవీ మేకర్స్ అంటూ ఓ నిర్మాణ సంస్థ ప్రారంభించి.. యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. తమ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాల డబ్బింగ్ హక్కులను కూడా సొంతం చేసుకొని.. తెలుగు యూత్ కి మంచి లవ్ స్టోరీస్ ని అందిస్తున్నారు.

ఈక్రమంలోనే రీసెంట్ గా ‘ట్రూ లవర్’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ సినిమాలో మణికందన్, గౌరీప్రియ హీరోహీరోయిన్స్ గా నటించారు. టీజర్, ట్రైలర్స్ తోనే యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ చిత్రం.. థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ ని అందుకుంటూ ముందుకు సాగుతుంది. కాగా ఈ మూవీ తెలుగు డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ కూడా లాక్ అయ్యాయి.

Also read : Chiranjeevi : చైనా దేశంలోని స్కూల్‌లో చిరంజీవి స్టోరీని.. ఇన్‌స్పిరేషన్‌గా చెప్పిన స్టూడెంట్.. వీడియో వైరల్

ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని డిస్నీ హాట్ స్టార్ ప్లస్ సొంతం చేసుకుందట. ఇక టీవీ ప్రసార హక్కులను స్టార్ మా దక్కించుకుందట. ఇక ఈ సినిమా ఓటీటీకి మార్చి ఫస్ట్ వీక్ లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరోహీరోయిన్లు కాలేజీ నుంచి ఆరేళ్ళ పాటు ప్రేమ జర్నీని కొనసాగిస్తూ వస్తుంటారు. అయితే ఈ జర్నీలో గొడవలు, అబద్దాలు పెరగడంతో.. బ్రేకప్‌లు ప్యాచప్‌లు జరుగుంటాయి. ఇలాంటి లవ్ స్టోరీ చివరికి సక్సెస్ అయిందా..? లేదా..? అనేది మిగిలిన కథ. మూవీ స్టోరీని మాత్రం రియల్ లైఫ్ స్టోరీస్‌లా రియలిస్టిక్ గా తెరకెక్కించారు.