Chiranjeevi : చైనా దేశంలోని స్కూల్‌లో చిరంజీవి స్టోరీని.. ఇన్‌స్పిరేషన్‌గా చెప్పిన స్టూడెంట్.. వీడియో వైరల్

చైనా దేశంలోని స్కూల్‌లో చిరంజీవి స్టోరీని ఇన్‌స్పిరేషన్‌గా చెప్పిన స్టూడెంట్. ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరు..? ఆమెకు చిరంజీవి గురించి ఏం తెలుసు..? ఆ స్టూడెంట్ ఎందుకు చిరంజీవిని అంతలా అభిమానిస్తోంది..?

Chiranjeevi : చైనా దేశంలోని స్కూల్‌లో చిరంజీవి స్టోరీని.. ఇన్‌స్పిరేషన్‌గా చెప్పిన స్టూడెంట్.. వీడియో వైరల్

Student gave a seminar about Chiranjeevi story in China school

Updated On : February 11, 2024 / 10:54 AM IST

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తెలుగు సినిమాలు వరుకే పరిమితం అయినా.. ఆయన క్రేజ్ మాత్రం హద్దులు ధాటి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగింది. తన నటన, డాన్స్, ఫైట్స్ తో ఎంతోమంది క్రేజ్ ని సంపాదించుకున్నారు. సౌత్‌లో రజినీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి యాక్టర్స్ ఉన్నా.. ప్రపంచంలో ప్రతిష్టాత్మికంగా నిర్వహించే ఆస్కార్ కి ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ హీరోగా చిరు రికార్డుల్లో నిలిచారు.

స్వయంకృషితో అంతటి శిఖరస్థాయికి ఎదిగిన చిరంజీవి జర్నీ ఎంతోమందికి ఆదర్శం. ఇక ఈ జర్నీనే ఇన్‌స్పిరేషన్‌ స్టోరీగా ఓ స్టూడెంట్ చైనా దేశంలోని ఓ స్కూల్‌లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ స్టూడెంట్ ఎవరు..? ఆమెకు చిరంజీవి గురించి ఏం తెలుసు..? ఆ స్టూడెంట్ ఎందుకు చిరంజీవిని అంతలా అభిమానిస్తోంది..?

చిరుని స్ఫూర్తిగా తీసుకోని చాలామంది.. పలు రంగాల్లో సక్సెస్ అయిన విషయాలను వింటూనే ఉంటాము. అలా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకోని ఇంటర్నేషనల్ స్థాయి వరకు ఎదిగిన డాన్స్ కొరియోగ్రాఫర్ ‘కొణతాల విజయ్’. అనకాపల్లికి చెందిన ఈ డాన్స్ మాస్టర్.. చిరంజీవి డాన్స్‌లు చూస్తూ ఎదిగారు. ఆ డాన్స్ లకు స్ఫూర్తి పొంది చిన్నప్పటి నుంచే డాన్స్ లు వేయడం మొదలు పెట్టారు.

Also read : Varun Tej – Lavanya Tripathi :తొలిప్రేమ స్టైల్‌లో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ పెళ్లి ప్రపోజల్ చేశాడట..

అలా స్కూల్ స్టేజి పోటీ నుంచి తెలుగు టీవీ ఛానల్స్ లోని డాన్స్ రియాలిటీ షోలు వరకు చేరుకున్నారు. అక్కడ తన ప్రతిభతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్.. అంతర్జాతీయస్థాయి వరకు ఎదిగాడు. థాయ్ లాండ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరుని తెచ్చుకున్న విజయ్.. కొందరు మిత్రుల ఆహ్వానంతో చైనా వెళ్లారు. ఇక అక్కడ టీవీ చానళ్స్ లో కొరియోగ్రాఫర్ గా మంచి స్థాయిని సంపాదించుకున్నారు.

ప్రస్తుతం చైనాలో పేరున్న కొరియోగ్రాఫర్ గా కొణతాల విజయ్.. మంచి హోదాని అందుకున్నారు. ఆ కొణతాల విజయ్ కుమార్తె.. ఆ స్టూడెంట్. తన తండ్రికి స్ఫూర్తి అయ్యి, తన తండ్రి సక్సెస్ కి కారణం అయిన చిరంజీవి గురించి చైనా స్కూల్ లో తన తోటి స్టూడెంట్స్ కి చెప్పి తన అభిమానాన్ని చాటుకుంది. ఆ వీడియో వైపు మీరు కూడా ఓ లుక్ వేసేయండి.