Varun Tej – Lavanya Tripathi :తొలిప్రేమ స్టైల్‌లో లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ పెళ్లి ప్రపోజల్ చేశాడట..
తొలిప్రేమ మూవీ స్టైల్‌లో లావణ్య త్రిపాఠికి పెళ్లి ప్రపోజల్ చేసిన వరుణ్ తేజ్.

Varun Tej marriage proposal to Lavanya Tripathi by tholi prema movie style
Varun Tej – Lavanya Tripathi : మెగా కపుల్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి.. గత ఏడాది నవంబర్ లో పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. ఇక పెళ్లి తరువాత కూడా లావణ్య తన యాక్టింగ్ కెరీర్ ని కొనసాగిస్తూనే వస్తున్నారు. తాజాగా లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు.
ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ తనకి ఎలా ప్రపోజ్ చేశారో చెప్పుకొచ్చారు లావణ్య. అంతరిక్షం, మిస్టర్ సినిమాల్లో కలిసి నటించిన వరుణ్ అండ్ లావణ్య.. ఇద్దరు కలిసే ప్రేమలో పడ్డారట. లవ్ జర్నీలో ఫస్ట్ ప్రపోజల్స్ అనేవి లేవట. కానీ పెళ్ళికి మాత్రం.. వరుణే ముందుగా ప్రపోజ్ చేశారట. ఆ సమయానికి లావణ్య పెళ్ళికి రెడీగా లేదట, కానీ వరుణ్ అడిగిన వెంటనే.. ఆమె ఓకే చెప్పేశారట.
Also read : Kalki 2898 AD : సినిమా రిలీజ్ అవ్వకుండానే.. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘కల్కి’ సంగీతం ప్రదర్శన.. వీడియో వైరల్
ఇక ఈ పెళ్లి ప్రపోజల్ ని వరుణ్ తన సినిమా ‘తొలిప్రేమ’ స్టైల్‌లో చెప్పారట. ఆ మూవీ ఎండింగ్ లో రాశిఖన్నాకి రింగ్ ఇస్తూ.. పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు వరుణ్. ఇక అదే సీన్ ని లావణ్య దగ్గర కూడా ఉపయోగించారట వరుణ్. అలా లావణ్య మెగా ఫ్యామిలీలోకి కోడలిగా వచ్చారు. మెగా కోడలిగా కొణిదెల వారి ఇంటిలో అడుగుపెట్టడం తన అదృష్టం అంటూ కూడా లావణ్య చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో లావణ్య.. తన నిక్ నేమ్ ని కూడా రివీల్ చేశారు. తనని చిన్నప్పటి నుంచి అందరు ‘చున్ చున్’ అని పిలిచేవారట. ఈ పేరు వినడానికి కార్టూన్ ‘చిన్ చాన్’లా ఉంది కదా. అయితే లావణ్యకి ఈ పేరు ఎలా వచ్చిందంటే.. చిన్నప్పుడు ఒక రైమ్ ఉండేదట. దానిలో ‘చున్ చున్’ అనే పదాన్ని లావణ్యకి ముద్దు పేరుగా పెట్టారట. ఆ పేరు అంటే లావణ్యకి కూడా ఇష్టమంట.