Kalki 2898 AD : సినిమా రిలీజ్ అవ్వకుండానే.. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘కల్కి’ సంగీతం ప్రదర్శన.. వీడియో వైరల్

సినిమా రిలీజ్ కి ముందే.. మూవీలోని OSTని సంగీత ప్రదర్శనలో ప్లే చేసిన కల్కి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.

Kalki 2898 AD : సినిమా రిలీజ్ అవ్వకుండానే.. మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘కల్కి’ సంగీతం ప్రదర్శన.. వీడియో వైరల్

Prabhas Kalki 2898 AD background score played by Santhosh Narayanan in music concert

Updated On : February 11, 2024 / 7:59 AM IST

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా టాలీవుడ్ తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898AD’. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. మరో మూడు నెలలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి.. ఒక చిన్న గ్లింప్స్ తప్ప మరొకటి రిలీజ్ కాలేదు. అభిమానులంతా ఓ సాలిడ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తుంటే.. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘కల్కి’ సంగీతం ప్రదర్శన ఇచ్చేశారు.

ఈ సినిమా సూపర్ హీరో గాడ్జెట్స్ తో ఫ్యూచరిస్టిక్ మూవీగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ అన్నది చాలా ముఖ్యమైంది. దీంతో సంతోష్ నారాయణన్.. ఈ మూవీ బ్యాక్‌‍గ్రౌండ్ స్కోర్ పై చాలా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా గ్లింప్స్ బ్యాక్‌‍గ్రౌండ్ స్కోర్ కి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడ్డాయి.

Also read : Nakkina Trinadha Rao : ఎన్నిసార్లు అడిగినా తనకి హీరోయిన్ హాగ్ ఇవ్వలేదంటూ.. దర్శకుడు కంప్లైంట్..

ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌‍గ్రౌండ్ స్కోర్ ని ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో సంతోష్ నారాయణన్ ప్రదర్శించారు. ఆ బీజీఎమ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇక సినిమా రిలీజ్ కి ముందే.. మూవీలోని OSTని సంగీత ప్రదర్శనివ్వడంతో.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఆ బీజీఎమ్ ని మీరు కూడా వినేయండి.

కాగా ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారంటూ నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు.