Nakkina Trinadha Rao : ఎన్నిసార్లు అడిగినా తనకి హీరోయిన్ హగ్ ఇవ్వలేదంటూ.. దర్శకుడు కంప్లైంట్..
ఎన్నిసార్లు అడిగినా తనకి హీరోయిన్ హగ్ ఇవ్వలేదంటూ.. టాలీవుడ్ డైరెక్టర్ 'త్రినాథ రావు నక్కిన' ఆడియన్స్ కి కంప్లైంట్ చేసారు. ప్రస్తుతం ఆ వీడియో..

Nakkina Trinadha Rao viral comments about Paayal Radhakrishna hug
Nakkina Trinadha Rao : టాలీవుడ్ రైటర్ అండ్ డైరెక్టర్ ‘త్రినాథ రావు నక్కిన’.. ఇప్పుడు నిర్మాతగా కూడా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ‘నక్కిన నరేటివ్స్’ బ్యానర్ పెట్టి మొదటి సినిమాగా ‘చౌర్య పాఠం’ని తీసుకు వస్తున్నారు. నిఖిల్ గొల్లమరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి మూవీ టీంతో పాటు ఇండస్ట్రీలోని పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా వచ్చారు.
ఇక ఈ ఈవెంట్ లో దర్శకుడు, చౌర్య పాఠం నిర్మాత త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. “హీరోయిన్ గా నటిస్తున్న పాయల్ రాధాకృష్ణ తెలుగు అమ్మాయే. కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారు. అక్కడ ఉంటున్నా తెలుగు బాగా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి మూవీ సెట్స్ లోని అందరికి హగ్ ఇస్తుంది. నాకు మాత్రం ఇవ్వదు. హగ్ కావాలని నేను చాలాసార్లు అడిగాను. అయినా ఇవ్వదు, కానీ పేమెంట్ మాత్రం మొత్తం తీసేసుకుంది. ఇప్పటికైనా ఇస్తావా” అంటూ స్టేజి పైనే హీరోయిన్ ని మరోసారి హగ్ అడిగారు.
Also read : Nikhil Siddhartha : పుట్టబోయే బేబీకి డైపర్స్ ఎలా వెయ్యాలో.. ఇప్పుడే నేర్చుకుంటున్న హీరో నిఖిల్..
దర్శకుడు మాటలకు పాయల్ రాధాకృష్ణ.. త్రినాథ రావుకి సైడ్ హగ్ ఇచ్చింది. అయితే ఆ హగ్ కి త్రినాథ రావు రియాక్ట్ అవుతూ.. “ఇది హగ్ అంటారా. హగ్ అంటే ఎలా ఉండాలి. కొడితే గూబ పగిలిపోవాలి. అలా ఉండాలి హగ్ అంటే” అని దర్శకుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతూ వస్తున్నారు.
ఇక ‘చౌర్య పాఠం’ మూవీ విషయానికి వస్తే.. టీజర్ చూస్తుంటే సినిమా కామెడీ హీస్ట్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. ఒక గ్రామంలో ఉన్న బ్యాంకుని కొల్లగొట్టడానికి ప్లాన్ చేసి, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్స్ గా ఆ ఊరిలోకి వెళ్లి, అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేది కథ అని తెలుస్తుంద. ఇంద్ర రామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్స్ గా నటిస్తున్నారు.