Telugu Indian Idol 2 : ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 జడ్జీలు, యాంకర్ వీళ్ళే..

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని సింగర్ హేమచంద్ర హోస్ట్ చేయనున్నాడు. జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు ఉండనున్నారు. తాజాగా ఈ కార్యక్రమం కర్టైన్ రైసింగ్ కార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే ఈ షో ఆహా ఓటీటీలో......................

telugu ott Aha launch Telugu Indian Idol season 2 streaming soon

Telugu Indian Idol 2 :  తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. దీంతో పలు షోలకు సీజన్ 2 అంటూ కొనసాగింపుగా మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ అంటూ లోకల్ సింగర్స్ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి సరికొత్త షోని తీసుకొచ్చి గ్రాండ్ సక్సెస్ చేసి ఎంతో మంది సింగర్స్ ని పరిచయం చేశారు.

నిత్యా మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయింది. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ షోకి హాజరయ్యారు. చిరంజీవి, బాలకృష్ణ సైతం ఈ షోకి గెస్టులుగా హాజరయి షోని మరింత పాపులర్ చేశారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1ని సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ చేశారు. ఈ సీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో ఇప్పుడు సీజన్ 2ని ప్రారంభించనున్నారు. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆడిషన్స్ పెట్టి ఆణిముత్యాల్లాంటి సింగర్స్ ని తీసుకున్నారు. అలా సెలెక్ట్ చేసిన కొంతమంది సింగర్స్ తో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ని కూడా గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

#SIR – Pre Release Event Live Updates : ధనుష్ సార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్..

ఇక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2ని సింగర్ హేమచంద్ర హోస్ట్ చేయనున్నాడు. జడ్జీలుగా తమన్, సింగర్ కార్తీక్, సింగర్ గీతా మాధురిలు ఉండనున్నారు. తాజాగా ఈ కార్యక్రమం కర్టైన్ రైసింగ్ కార్యక్రమం జరుపుకుంది. త్వరలోనే ఈ షో ఆహా ఓటీటీలో స్ట్రీమ్ కాబోతుంది. దీంతో మ్యూజిక్ అభిమానులు, ఈ షో అభిమానులు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.