బిగ్‌బాస్ 4 సీజన్ వేళాయే.. ఆ కంటెస్టెంట్లు ఎవరెవరంటే?

  • Publish Date - September 6, 2020 / 02:44 PM IST

Telugu BiggBoss 4 Season : తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4కు వేళ అయింది. అతి కొద్ది గంటల్లో బిగ్ బాస్ వచ్చేస్తున్నాడు.. స్టార్‌మా చాన‌ల్‌లో ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 6 గంట‌ల‌కు రియాల్టీ షో బిగ్‌బాస్ సీజ‌న్‌-4 ప్రారంభం కానుంది.



క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా ఈసారి బిగ్‌బాస్ ప్రాజెక్టు కాస్తా ఆలస్యంగా మొదలవుతోంది. కరోనా దెబ్బకు ఈసారి బిగ్ బాస్ షో ఉంటుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అన్నింటిని చెక్ పెడుతూ బిగ్ బాస్ 4 సీజన్ 16 మంది కంటెస్టెంట్లతో ముందుకు వస్తోంది. 105 రోజుల పాటు కొన‌సాగే ఈ షోలో ఈసారి కూడా 16 మంది కంటెస్టెంట్లు ఉంటారని స‌మాచారం.

వీరిలో పాల్గొనే కంటెస్టెంట్ల‌ు ఎవరెవరనే కాస్తా సస్పెన్ నడుస్తోంది. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినప్పటికీ వారిలో ఎంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొంటారు అనేది ఆసక్తిగా మారింది. ముందుగా షోలో పాల్గొనే టీవీ, ఫిల్మ్ సెలబ్రిటీల పేర్లు వినిపించాయి.. అందిన స‌మాచారం ప్రకారం.. విలేజ్ షో యూట్యూబ‌ర్‌గా పాపులార్ అయిన గంగ‌వ్వ‌, మ‌హాత‌ల్లి ఫేమ్ జాహ్న‌వి, ఇద్ద‌రు డైరెక్ల‌ర్లు సూర్య‌కిర‌ణ్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, న‌టులు లాస్య మంజునాథ్‌, దివి వైద్య‌, టీవీ9 న్యూస్ రీడ‌ర్‌ స‌త్య‌, యాంక‌ర్ సుజాత‌, క‌మెడియ‌న్ అవినాష్ తదితరులు పాల్గొంటారని సమాచారం.



ఈసారి 4వ సీజన్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అసలైన 16 మంది కంటెస్టెంట్లు ఎవ‌రనేది ఈరోజు సాయంత్రం ఆరు గంట‌ల‌కు తేలిపోనుంది.. మూడో సీజన్ షోను విజయవంతంగాముందుకు నడిపించిన నాగార్జున ఈసారి 4వ సీజన్ కూడా హోస్ట్‌ అనేది అందరికి తెలిసిందే. తొలి రోజున బిగ్ బాస్ షోలో పాల్గొనే 16 మంది కంటెస్టెంట్లను నాగార్జున రివీల్ చేయనున్నారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌న్నీ ప‌క్కాగా పాటిస్తూ షూటింగ్ చేసినట్టు తెలిసింది.



ఈ రియాల్టీ షోలో ఆట‌ాపాటే కాదు.. గొడ‌వ‌లు, ప్రేమ‌లు, ఇంకా మరెన్నో గిల్లికజ్జాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. వారం వారం ఎలిమినేష‌న్లు, ఓటింగ్ ప్ర‌క్రియ‌, టాస్క్‌లతో ప్రేక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేసేలా ఉంటుంది ఈ బిగ్ బాస్ షో.. కంటెస్టెంట్ల‌కు బిగ్‌బాస్ టాస్క్‌లు ఇస్తుంటాడు.. ప్రేక్ష‌కులు మాత్రం తమ ఓట్లతో అభిమాన కంటెస్ట్ ను గెలిపించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు.. బిగ్ బాస్ షో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీజన్ 4 ఇంకా కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.. ఈసారి బిగ్ బాస్ షోలో ఎలాంటి ట్విస్టులు టాస్క్ లు ఉంటాయో చూడాలి..