GAME ON : సైకలాజికల్ గేమ్ కథతో ‘గేమ్‌ఆన్’.. రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

సైకలాజికల్ గేమ్ కథతో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ స్టోరీ 'గేమ్‌ఆన్'. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

Telugu suspense action thriller GAME ON movie release date announce

GAME ON : దయానంద్‌ దర్శకత్వంలో సైకలాజికల్ గేమ్ కథతో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ స్టోరీ ‘గేమ్‌ఆన్’. గీతానంద్‌, నేహా సోలంకి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి మధుబాల, ఆదిత్య మీనన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ తో పాటు అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు నిర్మాతలు తెలియజేశారు. ఇంటెన్స్‌ అం సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందని వెల్లడించారు. కాగా గతంలోనే ఈ మూవీ నుంచి ఓ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అండ్ సాంగ్స్ ని కూడా ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి రియల్‌ టైమ్‌ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు. గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు, అసలు ఆ గేమ్‌ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్‌ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో ఆధ్యంతం ఉత్కంఠగా సాగనుంది. ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియల్ టైమ్‌ గేమ్‌ స్టోరీ కథలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ చిత్రం కూడా అదే నేపథ్యంతో రాబోతుంది. ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలానే ఉంది. కాగా ఈ సినిమాకి హైదరాబాద్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ నవాబ్‌ గ్యాంగ్‌ సంగీతం అందించారు. అరవింద్‌ విశ్వనాథన్‌ అద్భుతమైన విజువల్స్ ఇచ్చినట్లు టీజర్ చూస్తుంటూనే తెలుస్తుంది. మరి థియేటర్ లో ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.