Telugu Television Senior Star Cameramen Pothana Venkata Ramana Passed Away
Pothana Venkata Ramana : తెలుగు టెలివిజన్ పరిశ్రమలో స్టార్ కెమెరామెన్ కన్నుమూశారు. ఋతురాగాలు, సంసారం సాగరం, సిరి, బొమ్మరిల్లు.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కి కెమెరామెన్ గా పనిచేసిన పోతన వెంకట రమణ బుధవారం రాత్రి మరణించారు.
టీవీ పరిశ్రమలో కెమెరామెన్ అసిస్టెంట్ గా కెరీర్ మొదలుపెట్టి అనంతరం కెమెరామెన్ గా ఎదిగి ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కి కెమెరామెన్ గా పనిచేశారు. శ్రీ వైనతేయ అనే సీరియల్ కి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. కెమెరామెన్ గానే కాకుండా ఎడిటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా పలు సినిమాలకు పని చేసారు.
Also Read : Nabha Natesh : యాక్సిడెంట్ తర్వాత ‘స్వయంభు’ కోసం మారిన నభా నటేష్.. నభా వీడియో రిలీజ్..
గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న పోతన వెంకట రమణ ఇటీవల నిమ్స్ లో చేరారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ నిన్న బుధవారం రాత్రి మరణించారు. ఆయన స్వస్థలం మచిలీపట్టణం కావడంతో అంత్యక్రియలు అక్కడే జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. పోతన వెంకట రమణ మృతిపై టీవీ ప్రముఖులు, కెమెరామెన్ యూనియన్ సంతాపం ప్రకటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.