తెనాలి రామకృష్ణ – ఫస్ట్ లుక్

సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా 'తెనాలి రామకృష్ణ BA.BL.. ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 7, 2019 / 05:52 AM IST
తెనాలి రామకృష్ణ – ఫస్ట్ లుక్

Updated On : May 7, 2019 / 5:52 AM IST

సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ‘తెనాలి రామకృష్ణ BA.BL.. ఫస్ట్ లుక్ రిలీజ్..

సందీప్ కిషన్, హన్సిక జంటగా, సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం వంటి కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘తెనాలి రామకృష్ణ BA.BL.. కేసులు ఇవ్వండి ప్లీజ్.. అనేది ట్యాగ్ లైన్.. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై, అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.
లాయర్ గెటప్‌లో రిలాక్స్‌గా కుర్చీలో కూర్చుని, రెండు చేతులెత్తి దణ్ణం పెడుతున్న సందీప్ లుక్ బాగుంది. టేబుల్ మీద లాయర్ కోటు, టీ గ్లాస్, లా బుక్స్.. తెనాలి రామకృష్ణ హడావిడి మామూలుగా లేదు. ఓ మోస్తరు మార్కులతో పాసైనా, అద్భతమైన  తెలివి తేటలతో ఎటువంటి క్లిష్టమైన కేసునైనా సాల్వ్ చేసే కుర్రాడిగా సందీప్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. పందెంకోడి 2, సర్కార్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది.

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సందీప్ చేస్తున్న కామెడీ మూవీ ఇదే. మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : సాయి కార్తీక్, కెమెరా : సాయి శ్రీరామ్, సమర్పణ : ఇందుమూరి శ్రీనివాసులు, సహ నిర్మాతలు : రూప జగదీష్, వి.మహేశ్వర రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సీతారామరాజు మల్లెల.