Site icon 10TV Telugu

TFCC : తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన

TFCC guidelines to the producers

TFCC guidelines to the producers

తెలుగు చిత్ర‌ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్‌లోని యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిల్మ్ చాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఈ స‌మ్మెలో పాల్గొన్న వారితో ఎటువంటి చర్చలు లేదా సంప్రదింపులు చేయకూడదని స్ప‌ష్టం చేసింది.

స్టూడియోలు, ఔట్‌డోర్ యూనిట్లు, మరియు మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ముందస్తు సమాచారం.. స్పష్టమైన అనుమతి లేకుండా ఎలాంటి సేవలనూ అందించకూడదని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. నిర్మాతలు, స్టూడియో విభాగ సభ్యులు ఈ ఆదేశాలను అత్యంత తీవ్రంగా పరిగణించి వాటిని పూర్తిగా పాటించాలని ఫిల్మ్ చాంబర్ ఆదేశించింది. ఎవ‌రైనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది.

 

Exit mobile version