TFCC Elections : ఏకగ్రీవంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు

తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఇవి కూడా 'మా' ఎలక్షన్స్ లాగే చాలా రసవత్తరంగా మారతాయి అనుకున్నారు అంతా. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి.

Tfcc

TFCC Elections : తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ‘మా’ ఎన్నికలు, తర్వాత తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికలు, తాజాగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సినీ కార్మికుల కోసం, సినిమాల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ని స్థాపించారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. ఈ సారి కరోనా కారణంగా కొంచెం లేట్ గా జరిగాయి.

Samantha : ‘ఖతిజా’గా సమంత.. సమంతలో మరో కొత్తకోణం

తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్ కామర్స్ ఎన్నికలు అనౌన్స్ చేసినప్పుడు ఇవి కూడా ‘మా’ ఎలక్షన్స్ లాగే చాలా రసవత్తరంగా మారతాయి అనుకున్నారు అంతా. కానీ ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌గా మరోసారి ప్రతాని రామకృష్ణగౌడ్‌ నియమితులయ్యారు. టీఎఫ్‌సీసీ నూతన కార్యవర్గ కమిటీని నిన్న సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్‌, వైస్‌చైర్మన్లుగా గురురాజ్‌, డి.కోటేశ్వరరావు, నెహ్రూ, సెక్రటరీలుగా సాయివెంకట్‌, జె.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. అనంతరం ఈ కమిటీ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం అని తెలిపారు.