Thaai Kizhavi OTT: రూ.9 కోట్లతో చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ ‘తాయ్ కిళవి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
రాధికా నటించిన 'తాయ్ కిళవి(Thaai Kizhavi OTT)' ఇప్పుడు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.
- V Santhosh Kumar
- Published On : March 31, 2026 / 03:09 PM IST
thaai kizhavi movie ott update
Thaai Kizhavi OTT: సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi OTT). అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిన్న సినిమా, థియేటర్లలో ఏకంగా రూ. 75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
Varsha: వర్ష గ్లామర్ విందు.. హాఫ్ శారీలో ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హార్ట్ టచింగ్ కామెడీ డ్రామాను ప్రముఖ హీరో శివకార్తికేయన్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మించడం విశేషం.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్, సింప్లీ సౌత్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా అదే రోజు నుంచి ఈ సినిమా అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా 63 ఏళ్ల వయసులో రాధిక దాదాపు 5 గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని ‘పవునుత్తాయి’ అనే వృద్ధురాలి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆడియన్స్ ను అలరించడం విశేషం. ఆమె నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఈ అద్భుతమైన చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు.
