Valimai
Valimai: కోలీవుడ్ స్టార్ ‘తల’ అజిత్ కుమార్ ‘నేర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత వెంటనే నిర్మాత బోనీ కపూర్, దర్శకుడు హెచ్. వినోద్‌లతో కలిసి ‘వలిమై’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అజిత్ హీరోగా నటిస్తున్న 60వ సినిమా ఇది.. ఈ సినిమాతో టాలీవుడ్ హీరో ‘ఆర్ఎక్స్ 100’ కార్తికేయ విలన్‌గా నటిస్తున్నాడు..
Balayya : ‘లైగర్’ సెట్‌లో ‘లయన్’..
సెప్టెంబర్ 21న కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌కి రెస్పాన్స్ అదిరిపోయింది. రీసెంట్‌గా రిలీజ్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. 2022 సంక్రాంతికి ‘వలిమై’ బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే తమిళ నాట దళపతి విజయ్, తల అజిత్ ఇద్దరూ బిగ్ స్టార్స్.. వీళ్ల సినిమాలు ఒకేసారి విడుదలైన సందర్భాలలో ఇరు హీరోల అభిమానులు ఘర్షణ పడ్డ ఘటనలు చాలానే జరిగాయి. వచ్చే సంక్రాంతికి విజయ్ నటిస్తున్న ‘బీస్ట్’ సినిమా రిలీజ్ చెయ్యబోతున్నామని ముందే ప్రకటించారు. ఇప్పుడు ‘వలిమై’ మేకర్స్ కూడా పండగ సీజన్‌కే రాబోతున్నట్లు చెప్పడంతో 2022 సంక్రాంతి కోలీవుడ్ బాక్సాఫీస్ వార్ ఆసక్తికరంగా మారింది.
Pelli SandaD Trailer : మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘పెళ్లిసందD’ ట్రైలర్..