Thaman makes sensational comments on Mahesh Babu fans
Thaman: ఓజీ సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ ను తన కథలో వేసుకున్నాడు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది ఓజీ. విడుదలకు ముందే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజే రూ.154 కోట్ల భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక ఈ సినిమాకి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. తన ఎలక్ట్రిఫయింగ్ బీజీఎమ్ తో సినిమాని నెక్స్ట్ (Thaman)లెవల్ కి తీసుకెళ్లాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఓజీ సినిమా అనే కాదు తన ప్రతి సినిమాకి అదే రేంజ్ లో మ్యూజిక్ అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
Prabahs-Hanu: ముందు కోపం తగ్గించుకో.. ప్రభాస్ స్వీట్ వార్నింగ్.. డైరెక్టర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్
తాజాగా ఓజీ సక్సెస్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తమన్. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “ఈ మధ్య ఒక సినిమా విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ సినిమాకు మహేష్ బాబు ఫ్యాన్స్ నాపై చాలా ట్రోలింగ్ చేశారు. నేను ప్రతీ సినిమాకి ఒకే విదంగా కష్టపడతాను. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఫీలింగ్ నాకు ఉండదు. కానీ, సినిమాలో విషయం లేకపోతే నేను ఎంత చేసినా కనిపంచదు. కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ ట్రోల్ల్స్ చేసినప్పుడు చాలా బాధేసింది. డార్క్ రూమ్ లో చాలాసార్లు ఏడ్చాను” అంటూ కొంచం ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దాంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.