Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో ట్రైన్ ఫైట్ మాములుగా ఉండదు.. తమన్ ట్వీట్ వైరల్..

తమన్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేసి..

Thaman Tweet on Ram Charan Game Changer Train Fight Sequence

Game Changer : మూడేళ్ళుగా ఎదురుచూసిన మెగా ఫ్యాన్స్ కు ఇటీవల రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ అయి అవి ట్రెండ్ అయ్యాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. తాజాగా నేడు టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేయనున్నారు.

Also Read : Prabhas – Spirit : దీపావళి రోజు ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ..

అయితే టీజర్ డేట్ అనౌన్స్ చేస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో రామ్ చరణ్ లుంగీ కట్టుకొని పట్టాల మీద కూర్చున్నాడు. తన ముందు కొంతమంది విలన్ మనుషులను పట్టాల మీద పడుకోపెట్టాడు. వెనకాల ట్రైన్ వస్తున్నట్టు ఉంది. ఇది ఒక యాక్షన్ సీన్ అని తెలుస్తుంది. దీంతో ఈ మాస్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ పోస్టర్ షేర్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆసక్తికర ట్వీట్ వేశారు.

తమన్ గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేసి.. ఈ ట్రైన్ ఫైట్ ఫుల్ హై గా ఉంటుంది. టీజర్ అదిరిపోతుంది అని అంచనాలు పెంచుతూ ట్వీట్ చేసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ సినిమాలో ట్రైన్ ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందని ఆశిస్తున్నారు. గతంలో ఈ ట్రైన్ ఫైట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ లొకేషన్ నుంచి ఓ ఫోటో కూడా షేర్ చేసారు. పూణే సమీపంలో ఈ షూట్ చేసినట్టు తెలుస్తుంది. మరి తమన్ చెప్పినట్టు ఈ ట్రైన్ ఫైట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా ఎదురుచూడాలి. లేదా టిజర్ లో ఈ సీన్ కి సంబంధించిన షాట్ ఏమైనా పెడతారా చూడాలి.