Tammreddy Bharadwaja Serious Comments on Vishwak Sen and Tollywood Young Heros
Thammareddy Bharadwaja: తెలుగు దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ టాలీవుడ్ యంగ్ హీరోలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటి యువ హీరోలంతా వారి పద్ధతిని మార్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో మరియు దర్శకుడు అర్జున్ సర్జా, టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య సినిమా విషయంలో ఇటీవల ఒక వివాదం రాచుకుంది. ఈ విషయంపై తమ్మారెడ్డి తనదైన శైలిలో స్పందించాడు.
Vishwak Vs Arjun : విశ్వక్సేన్, అర్జున్ మధ్య సినిమా వివాదం
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో.. అతడి కూతురుని హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. కాగా మూవీ సెట్స్ పై వెళ్లే సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో టాలీవుడ్ లో వివాదం చెలరేగింది. దీని గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందే హీరోలు కథ నచ్చిందా, లేదా? అలాగే నిర్మాతతో ఓకే అనుకున్నాకే సెట్స్ పైకి వెళ్ళాలి.
అలా కాకుండా ముందు ఓకే చెప్పేసి, తరువాత మాటలు నచ్చలేదు, పాటలు నచ్చలేదనడం సరికాదు. అయితే విశ్వక్.. తనకి కథ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి మాట్లాడుకున్నాక షూటింగ్ వెళదామని చెబుతున్నాడు. అలాగే అర్జున్ కి కూడా దర్శకుడిగా సూపర్ హిట్లు ఇచ్చిన అనుభవం ఉంది. ఒకవేళ అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుని ఉంటె విశ్వక్ ముందుగానే చెప్పి ఉండాల్సింది.
కొత్త దర్శకులు కొత్త కథలతో వస్తున్న సమయంలో.. హీరోలు కథలో వేలుపెట్టడం వల్ల చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. సీనియర్ యాక్టర్ ఎన్టీఆర్ గారు ఒక్కసారి సినిమా ఒప్పుకున్నాక, దర్శకుడు ఎలా చెబితే అలా చేసేవారు. ఇప్పుడున్న బాలకృష్ణలో కూడా నేను అదే చూస్తున్నా. విశ్వక్ చేసిన పని అర్జున్‌కే కాదు ఏ దర్సకనిర్మాతకీ అయినా చిరాకు తెప్పింస్తుంది. విశ్వక్ మాత్రమే కాదు, ఇప్పుడున్న చాలా మంది యువ హీరోలు స్టేజి మీద ఎలాపడితే అలా మాట్లాడుతున్నారు. వారందరు ఆ పద్దతని మార్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు.