Tharun Bhasckar Keedaa Cola Movie Trailer Released
Keedaa Cola Trailer : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ అందర్నీ అలరించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎట్టకేలకు తన మూడో సినిమాతో రాబోతున్నాడు. ‘కీడా కోలా’ అనే వెరైటీ టైటిల్ తో నవంబర్ 3న తన నెక్స్ట్ సినిమా రిలీజ్ చేయబోతున్నాడు. ఇటీవల టీజర్ ని రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ఈ మూవీ టైటిల్ లోని కీడా అంటే బొద్దింక అని అర్ధం. టీజర్ లో ఈ కీడా ఒక కోలాలో చిక్కుకొని కనిపిస్తుంది.
తాజాగా కీడాకోలా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. చైతన్యరావు, రాగ్ మయూర్ ఏదో సమస్యలో ఇరుక్కున్నట్టు అందుకు కోటి రూపాయలు కట్టాల్సి వచ్చినట్టు, అదే టైంలో తరుణ్ భాస్కర్ రౌడీగా జైలు నుంచి బయటకు రావడం, జీవన్ తన వల్ల గెలిచిన కార్పొరేటర్ అవమానించడంతో అతనిపై పగ పెంచుకోవడం, మరో వైపు ఓ బిజినెస్ మెన్.. ఇలా సినిమాలో మూడు నాలుగు కథలు నడుస్తూ వాటి అన్నిటికి ఎలా లింక్ కలుపుతారు అనేది క్రైమ్ కామెడీతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ కూడా సినిమాలో కనిపించబోతున్నాడు. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.