Kangana Ranaut : నేను డేటింగ్‌లో ఉన్నది నిజమే.. కానీ నిశాంత్‌తో కాదు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిశాంత్ పిట్టితో డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు మొదలయ్యాయి. తాను డేటింగ్‌లో ఉన్నది నిజమేనన్న కంగనా నిశాంత్‌తో కాదని క్లారిటీ ఇచ్చారు.

Kangana Ranaut

Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను డేటింగ్‌లో ఉన్నట్లు కన్ఫమ్ చేశారు. కానీ నిశాంత్ పిట్టితో కాదని క్లారిటీ ఇచ్చారు. రామ మందిర ప్రారంభోత్సవంలో నిశాంత్‌తో కంగనా కనిపించడంతో వచ్చిన వార్తలను ఖండించారు.

Priyanka Jain : బిగ్ బాస్ కంటెస్టెంట్ తల్లికి క్యాన్సర్.. ఎమోషనలైన నటి

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాను డేటింగ్‌లో ఉన్నానని ధృవీకరించారు. అయితే EaseMyTrip కో-ఫౌండర్ నిశాంత్ పిట్టి కాదని క్లారిటీ ఇచ్చారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకల్లో నిశాంత్‌తో కంగనా రెండుసార్లు కనిపించిన తర్వాత వీరిద్దరి డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. ఈ విషయంపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందించారు. ‘దయచేసి పుకార్లు సృష్టించవద్దు.. నిశాంత్ పిట్టి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు.. నేను వేరొకరితో డేటింగ్‌లో ఉన్నాను.. అతనెవరో నేను చెప్పేవరకు దయచేసి వేచి ఉండండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు.. కలిసి ఫోటోలు దిగిన ప్రతి వ్యక్తితో ఆ మహిళకు లింక్ చేయడం సరికాదు.. దయచేసి ఇలా చేయకండి’ అంటూ కంగనా రిక్వెస్ట్ చేసారు. అయితే కంగనా బాయ్ ఫ్రెండ్ ఎవరై ఉంటారని అభిమానులు చర్చించుకుంటున్నారు.


Kangana Ranaut

కాగా 2023 లో తేజస్, చంద్రముఖి 2 సినిమాలతో అలరించిన కంగనా ప్రస్తుతం ‘ఎమర్జెన్సీ’ మూవీతో బిజీగా ఉన్నారు. కంగనా ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. కంగనా పవర్ ఫుల్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.