the famous actor Meghnathan passed away by Suffering with that disease
Meghnathan : ప్రముఖ మలయాళ నటుడు మేఘనాథన్ బుధవారం కన్నుమూశారు. గతకొంత కాలంగా ఆయన ఊపిరితిత్తులకి సంబందించిన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దీనికి గాను కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ కష్టసమయంలో ఆయనకి భార్య సుస్మిత, కుమార్తె పార్వతి తోడుగా ఉన్నారు. చికిత్స తీసుకుంటూనే ఆయన మరణించారు.
ఇకపోతే మేఘనాథన్ కుటుంభ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన అంత్యక్రియలు కేరళలోని షోరనూర్‌లో నేడు జరిగాయి. ఎన్నో సినిమాల్లో నటించిన మేఘనాథన్ కన్ను మూయడంతో ఆయన అభిమానులు, నెటిజన్స్ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. ఇన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కొనసాగిన ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తున్నారు.
Also Read : Allu Sneha- Allu Arha : అల్లు అర్హ బర్త్ డే.. స్పెషల్ పోస్ట్ షేర్ చేసి విషెస్ చెప్పిన స్నేహ రెడ్డి..
ఇకపోతే ప్రముఖ మలయాళ నటుడు మేఘనాథన్ తన సినీ కెరీర్ ను 1983లో ప్రారంభించారు. దాదాపుగా మూడు దశాబ్దాల నుండి ఆయన 50 సినిమాల కంటే ఎక్కువే చేశారు. పంచాగ్ని, చమయం, భూమిగీతం, చెంకోల్, రాజధాని, ప్రయిక్కర పప్పన్, వంటి సినిమాలు మంచి విజయాన్ని అదుడుకున్నాయి. కేవలం సినిమాలే కాకుండా సీరియల్స్ కూడా ఈయన చేసారు. ఇక ఇప్పటికే చాలా మంది మలయాళ సినీ ప్రముఖులు ఆయన చనిపోవడంతో ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.