The Great Pre-Wedding Show Movie streaming from December 5th on Zee5 ott
The Great Pre Wedding Show OTT: ఈమధ్య కాలంలో పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలా టాలీవుడ్ లో వచ్చిన రీసెంట్ సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో'(The Great Pre Wedding Show OTT). 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో తిరువీర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో టీనా శ్రావ్య హీరోయిన్ గా నటించింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ తెరకెక్కించగా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ వచ్చింది.
Dil Raju: క్రేజీ టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ కోసమేనా.. డైరెక్టర్ ఎవరంటే.?
లాంగ్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా జీ5 ఓటీటీ సంస్థ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్స్ లో మంచి ఫలితాన్ని రాబట్టిన ఈ సినిమాకు ఓటీటీలో అంతకుమించి ఆదరణ దక్కే అవకాశం ఉందని టాక్. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.