The Indian Border : ‘ది ఇండియన్ బార్డర్’ నుంచి దేశభక్తి సాంగ్ రిలీజ్..
మీరు కూడా ఈ సాంగ్ వినేయండి.. (The Indian Border)
The Indian Border
The Indian Border : ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నివేద్య రెడ్డి నిర్మాణంలో డి.ఎస్.బాషా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఇండియన్ బార్డర్’. కిరణ్ యార్లగడ్డ, ఆదర్ష్, మురళీ మోహన్, మేఘా శ్రీ, సిందు తులాని.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ దేశ భక్తి సాంగ్ ని విడుదల చేశారు.
‘జిందా రహేన్ తో డ్యూటీ’ అంటూ సాగే ఈ హిందీ సాంగ్ ను ఆనంద్ మంత్ర సంగీత దర్శకత్వంలో డి.ఎస్. బాషా రాయగా శరవణ పాడారు. జవాన్ల త్యాగాల్ని, ధైర్య సాహసాల్ని గుర్తు చేసేలా ఈ పాట సాగింది. మీరు కూడా ఈ సాంగ్ వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో మేజర్ ఎస్పీఎస్ ఒబేరాయ్ మాట్లాడుతూ.. దేశం, సైన్యం గురించి సినిమా తీయడం, దానికి నన్ను గెస్ట్ గ పిలవడం ఆనందంగా ఉంది. నాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకపోయినా దేశభక్తి సినిమా అని వచ్చనిట్టు తెలిపారు. నటుడు కిరణ్ యార్లగడ్డ మాట్లాడుతూ.. పాలస్తీనా వార్ టైంలో ఈ కథ పుట్టింది. డి.ఎస్.బాషా ఈ కథకు ఓ స్వరూపాన్ని తీసుకు వచ్చారు. సైనికుడు చేసే త్యాగం, సైనికుడి భార్య చేసే త్యాగాల్ని ఇందులో చూపించాం అని తెలిపారు.

దర్శకుడు డి.ఎస్.బాషా మాట్లాడుతూ.. సైనికుడి త్యాగం, ఆలోచనలు, గొప్పదనం చెప్పేలా ఈ సినిమా ఉంటుంది. ఈ పాటను సైనికుడికి అంకితం చేసేలా తీశాం. మనం ఈ రోజు ఇక్కడ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం సైనికుడు చేసే త్యాగమే అని అన్నారు. నిర్మాత నివేద్య రెడ్డి మాట్లాడుతూ.. నా తండ్రి కూడా ఒక సైనికుడే. అందుకే ఈ సినిమా తీస్తున్నాను. ఈ చిత్రంతో మానవ సంబంధాలు, ఎమోషన్స్‌ని చూపించాలని అనుకున్నాం. సైనికులకు అంకితమిచ్చేలా మా సినిమా ఉంటుంది అని అన్నారు.
