ప్రియాంక చోప్రా ఆస్కార్ 2021కు నామినేట్ కానుందా?

  • Publish Date - September 21, 2020 / 01:39 PM IST

ఆస్కార్ 2021కి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నామినేట్ కానుందా? ఈ ప్రశ్న చాలా మంది మనస్సులలో ఉంది. ప్రియాంక ‘మ్యాట్రిక్స్’, ‘ది వైట్ టైగర్’ నుండి ‘సీతాడేల్’ వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ది వైట్ టైగర్’ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


వచ్చే ఏడాది జరగబోయే ఆస్కార్‌ వేడుకలో ఈ సినిమా తరఫున ఉత్తమ సహాయ నటి విభాగంలో ప్రియాంక చోప్రాకు చోటు దక్కే అవకాశం ఉందని టాక్‌. మరి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను ప్రియాంక గెలుచుకుంటారా? లేదా? వేచి చూడాలి. ఇండో–ఆస్ట్రేలియన్‌ రచయిత అరవింద్‌ అడిగి రచించిన ‘ది వైట్‌ టైగర్స్‌’ నవలను అదే పేరుతో సినిమాగా రూపొందించగా.. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రనిర్మాత రామిన్ బహ్రానీ దర్శకత్వం వహించారు. కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాను నేరుగా OTT ప్లాట్‌ఫాంపై విడుదల చేయబోతున్నారు. ఇక ఆస్కార్ బరిలో ప్రియాంకతో పాటు మెరిల్ స్ట్రీప్ (ది ప్రోమ్ ), హాన్ యెన్-రి (మినారి), క్రిస్టిన్ స్కాట్ థామస్ (రెబెక్కా) ఒలివియా కోల్మన్ (ది ఫాదర్ ) వంటి వారు పోటీలో నిలవనున్నట్లు చెబుతున్నారు.



ట్రెండింగ్ వార్తలు