Radhe Shyam : మార్చి 18న ‘రాధే శ్యామ్’?

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మార్చి 18న ‘రాధే శ్యామ్’ రిలీజ్ చేసి తీరాలనే నిర్ణయంతో ఉన్నారు మేకర్స్..

Radhe Shyam : మార్చి 18న ‘రాధే శ్యామ్’?

Radhe Shyam

Updated On : January 17, 2022 / 11:41 AM IST

Radhe Shyam: ‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో పాటు ‘పాన్ ఇండియా స్టార్’ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తర్వాత వరుసగా పాన్ ఇండియా ఆ తర్వాత పాన్ వరల్డ్ సినిమాలతో సందడి చేస్తున్నాడు. దాదాపు మూడేళ్లుగా ‘రాధే శ్యామ్’ సినిమాకే అంకితమైపోయారు ప్రభాస్ అండ్ రాధా కృష్ణ..

Radhe Shyam : ‘రాధే శ్యామ్’ నేషనల్ ఈవెంట్ హైలైట్స్

ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కి రెడీ అయిపోయింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 14న ‘రాధే శ్యామ్’ ప్రంపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అని ఫిక్స్ అయిపోయారు. కట్ చేస్తే, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ వాయిదా పడింది.

Radhe Shyam Trailer : తెలుగు తెరపై ‘టైటానిక్’ చూడబోతున్నాం!

సినిమా రెడీ అయిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, మరికొన్ని చోట్ల 50% ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 18 నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మార్చి 18కి మేకర్స్ ‘రాధే శ్యామ్’ రిలీజ్ చేసి తీరాలనే నిర్ణయంతో ఉన్నారని ఫిలింనగర్ టాక్.