Pan Indian Thriller
Pan Indian thriller: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమ కథా చిత్రమ్ వంటి సినిమాలతో స్టార్ కమెడియన్‌గా మారిన సప్తగిరి.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోగా ఎదిగారు. తర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్న సప్తగిరి.. ఒక పక్క హీరోగా నటిస్తూనే, మరో పక్క కమెడియన్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సప్తగిరి ‘eight’ అంటూ ఓ పాన్ ఇండియా సినిమాలో కూడా నటిస్తున్నారు.
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యాస్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో స్నేహా ఉల్లాల్ కథానాయికగా నటిస్తుంది. సోనియా అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా టీజర్‌ను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఉదయం 08:08 నిమిషాలకు విడుదల చేయబోతుంది చిత్రయూనిట్.
ఇల్యూజన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జనవరిలో అనౌన్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ టైమ్ నుంచే సినిమాపై హైప్ మొదలైంది. సప్తగిరి ఫస్ట్ లుక్‌లో చాలా క్లాస్‌గా ఉండగా.. గాయపడ్డ చేతి వేళ్ళ మధ్యలో సిగార్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సప్తగిరి కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా అర్థం అవుతుంది.