The Red Bag : షూటింగ్ పూర్తిచేసుకున్న రెడ్ బ్యాగ్..
నేడు ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. (The Red Bag)
The Red Bag
The Red Bag : హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల థాయిలాండ్ లో కొన్ని సీన్స్, ఓ సాంగ్ ని చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తయింది.
నేడు ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. రక్తతో తడిచి ఉన్న రెడ్ బ్యాగ్, పోస్టర్ లో కత్తులు, గన్స్.. ఉండటంతో ఇదేదో థ్రిల్లర్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కబీర్ సింగ్ మెయిన్ లీడ్ గా నటిస్తుండగా ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకొని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

