కొత్త లుక్ గుండు వెనకున్న సీక్రెట్‌ను రివీల్ చేసిన మెగాస్టార్‌

  • Publish Date - September 15, 2020 / 12:48 PM IST

సరికొత్త లుక్ వెనకున్న సీక్రెట్‌ను మెగాస్టార్‌ చిరంజీవి రివీల్‌ చేశారు. చిరంజీవి ఇటీవల కొత్త లుక్‌తో తన అభిమానులను ఆశ్చర్యపర్చారు. నున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో అర్బన్‌ మాంక్‌ స్టైల్‌లో చిరు కనిపించారు. ఈ లుక్‌ను అభిమానులు లైక్‌లతో ముంచెత్తారు. అంతేకాకుండా చిరు నిజంగా గుండు చేయించుకున్నారా..? యాప్‌ సహాయంతో అలా కనిపించారా..? లేదా ఫొటో ఎడిటింగ్‌‌ మహిమా? అనే సందేహలు అభిమానుల్లో మొదలయ్యాయి.




అయితే తన అర్బన్ మాంక్ లుక్ వెనకున్న మేకప్ సీక్రెట్‌ను ఓ వీడియో ద్వారా రివీల్ చేశారు మెగాస్టార్. తన కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన… ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌కి థాంక్స్ చెప్పారు చిరంజీవి.


https://10tv.in/suma-kanakala-shared-a-cute-photo/