Super Stars Comebacks in 2023 : ఈ టాప్ స్టార్స్‌కి 2023 గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది

ముగ్గురు సూపర్ స్టార్లు.. వాళ్ల సినిమాలంటే ఓ రేంజ్‌లో కలెక్షన్స్.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. అంతా బాగానే ఉన్నా సరైన హిట్ పడట్లేదు. 2023 ఆ ముగ్గురికి బాగానే కలిసొచ్చింది. పూర్వ వైభవం తిరిగొచ్చింది. ఎవరా స్టార్లు ? చదవండి.

Super Stars Comebacks in 2023

Super Stars Comebacks in 2023 : ఆ ముగ్గురు పాన్ ఇండియా స్టార్లు.. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా ఫ్లాప్‌లు చవి చూసారు. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయిన ఆ స్టార్లకు 2023 బాగానే కలిసొచ్చింది. ఈ ముగ్గురు స్టార్లు తమ సినిమాలతో హిట్టు కొట్టి పూర్వ వైభవం సంపాదించుకున్నారు. ఎవరా స్టార్లు..? చదవండి.

Tollywood : ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..

డార్లింగ్ ప్రభాస్ కెరియర్ గ్రాఫ్ ఈశ్వర్ నుండి మొదలుపెడితే మంచి హిట్స్ పడ్డాయని చెప్పాలి. అడవి రాముడు, చక్రం, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు మినహాయించి 2013 లో వచ్చిన మిర్చి వరకు అన్ని సినిమాలు ఆల్ మోస్ట్ హిట్టయ్యాయి. 2015 లో వచ్చిన బాహుబలి: ది బిగినింగ్, 2017 లో దానికి కంటిన్యూషన్‌గా వచ్చిన బాహుబలి 2: ది కన్‌క్లూజన్ ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ చేశాయి. ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రేక్షకుల్లో కూడా ప్రభాస్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగా సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ అనుకున్నట్లుగా ఆడలేదు. వసూళ్ల సంగతి పక్కన పెడితే ప్రభాస్‌కు మంచి హిట్ పడలేదు.

2023 ప్రభాస్‌కు బాగా కలిసొచ్చింది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ డిసెంబర్ 22 న థియేటర్లలోకి వచ్చింది. 6 ఏళ్ల తర్వాత ప్రభాస్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చింది. ఇదే పంథాలో ప్రభాస్ నెక్ట్స్ సినిమాలు ఉంటే 2024 ప్రభాస్‌కు తిరుగులేదని చెప్పాలి.

Venky75 : వెంకీ మామ 75 ఫిలిమ్స్ సెలబ్రేషన్స్‌ ఈవెంట్ గ్యాలరీ..

సూపర్ స్టార్ రజనీకాంత్ 50 సంవత్సరాల సినీ కెరియర్‌లో తమిళ, హిందీ, కన్నడ, తెలుగు, బెంగాలీ భాషల్లో 169 పైగా సినిమాలు చేసారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు రజనీకాంత్. ఆయన స్టైల్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. 1975 లో ‘అపూర్వ రాగంగల్’ సినిమాతో పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన రజనీకాంత్‌కి చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ అత్యంత భారీ వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా పేరు కొట్టేసింది. 2007 లో వచ్చిన ‘శివాజీ’ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. 2010 లో వచ్చిన రోబో హిట్టైంది. దానికి సీక్వెల్ గా 2018లో వచ్చిన 2.0 పైసలు వసూలు చేసినా రజనీకాంత్‌కి పెద్దగా హిట్ ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత మరో 3 సినిమాలు చేసినా దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2023 రజనీకాంత్‌కి కలిసొచ్చిందనే చెప్పాలి. ‘జైలర్’ సినిమా రూ.600 కోట్ల వసూలు చేసి రజనీకాంత్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.210 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు.

Upasana : చరణ్ విజయం వెనుక నేను కాదు.. నాకు సపోర్ట్‌గా చరణ్.. ఉపాసన కామెంట్స్..

బాద్ షా ఆఫ్ బాలీవుడ్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్‌లో తిరుగులేని నటుడు. 90 కి పైగానే సినిమాల్లో నటించిన షారుఖ్ 1992 లో నటించిన ‘దీవానా’తో మొదలు పెడితే ప్రేక్షకుల మనసు దోచుకుంటూనే ఉన్నారు. బాజీగర్, డర్ సినిమాలలో విలన్‌గా గుర్తింపు పొందినా.. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై లతో భారీ హిట్స్ అందుకున్నారు షారుఖ్ ఖాన్. 2008 లో వచ్చిన రబ్ నే బనా ది జోడి, 2013 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ తరువాత షారుఖ్‌కి మంచి హిట్ పడలేదని చెప్పాలి. సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత 2023 లో షారుఖ్ పఠాన్, జవాన్‌ లతో తన కెరియర్ సెట్ చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు అత్యథిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. 2023 చివర్లో విడుదలైన ‘డంకీ ‘షారుఖ్‌కి మంచి కంబ్యాక్ ఇవ్వడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇలా ఈ సూపర్ స్టార్లు 2023 లో తమ కెరియర్లో తిరిగి హిట్లు అందుకుని దూసుకుపోతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు