Penchal Das : అమ్మాయిలపై దారుణాల గురించి.. పెంచల్ దాస్ పాడిన ‘నా నల్లా కలువా పువ్వా..’ సాంగ్ విన్నారా?

అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి 'నా నల్లా కలువా పువ్వా..' అంటూ ఈ సాంగ్ సాగుతుంది.

Theppa Samudram Movie Penchal Das Naa Nalla Kaluvapuvvaa Lyrical Song Released

Penchal Das : బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా రవి శంకర్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘తెప్ప సముద్రం’. శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సతీష్ రాపోలు దర్శకత్వంలో నీరుకంటి రాఘవేందర్ గౌడ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ చేసారు. వరుస అమ్మాయిల హత్యలు, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్ విడుదల చేశారు.

Also Read : Mrunal Thakur : బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృణాల్ ఠాకూర్ పూజలు.. మా పేరెంట్స్ చెప్పినట్టే..

అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు సంబంధించి ‘నా నల్లా కలువా పువ్వా..’ అంటూ ఈ సాంగ్ సాగుతుంది. అరవిందసమేత వీరరాఘవ సినిమాలోని సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న పెంచల్ దాస్ ఈ ఎమోషనల్ సాంగ్ ని రచించి పాడారు. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందించాడు. ఎమోషనల్ గా పాట మనసులని కదిలించే విధంగా ఉంది. ఇక ఈ తెప్ప సముద్రం సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ ఎమోషనల్ సాంగ్ ని మీరు కూడా వినేయండి.

ట్రెండింగ్ వార్తలు