Theres still that backlog Do you know what Vishwak Sen studied
Vishwak Sen : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాస్ కా దాస్ గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తాజాగా నటించిన సినిమా మెకానిక్ రాకీ. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుండే టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేశారు. ఇక ఇందులో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటించారు.
Also Read : Suma Kanakala : ‘గొప్ప మనసు చాటుకున్న సుమ’.. ఇంత మందికి సహాయం చేస్తుందా..
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేమర్స్ మీట్ లో మాట్లాడుతూ.. ” మీరు CSE చదివి మెకానిక్ అవుతారు కదా. రియల్ లైఫ్ లో బీటెక్ బ్యాగ్ డ్రాప్ ఏమన్నా ఉంటుందా అంటే.. లేదు నేను బీటెక్ సైడ్ వెళ్ళలేదు. హ్యాపీ డేస్ సినిమా చూసి అందరూ బీటెక్ చేసి మోసపోయారు. నేను అలా మోసపోకూడదని BA మాస్ కమ్యూనికేషన్ , జర్నలిజం చేశా అంటూ నవ్వుతూ తెలిపాడు విశ్వక్. అయినా కూడా నాకు ఇప్పటికీ పొలిటికల్ సైన్స్ బ్యాక్ లాగ్ ఉందని తెలిపాడు. ఎవరన్నా అడిగితే BA డిస్ కంటిన్యూ అని కూల్ గా చెప్తా” అంటూ తెలిపాడు విశ్వక్.
దీంతో విశ్వక్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈ విషయంతో విశ్వక్ ఏం చదువుకున్నాడో కూడా తెలిసింది. ఇకపోతే ఇప్పటికే గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న విశ్వక్ ఇప్పుడు మెకానిక్ రాకీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.