Bollywood Bigstars: హాలీవుడ్ సినిమాలను తిరస్కరించిన బాలీవుడ్ నటులు వీరే!

హాలీవుడ్ సినిమాలో నటించాలని ఏ నటులకు ఉండదు. మన సినిమా అంటే మన దేశానికే పరిమితం. ఇప్పుడిప్పుడే ఇతర దేశాలలోని మన ప్రేక్షకులతో పాటు ఇతర దేశాల ప్రేక్షకులకు ఇండియన్ సినిమాలు దగ్గరవుతున్నాయి.

Bollywood Bigstars: హాలీవుడ్ సినిమాలో నటించాలని ఏ నటులకు ఉండదు. మన సినిమా అంటే మన దేశానికే పరిమితం. ఇప్పుడిప్పుడే ఇతర దేశాలలోని మన ప్రేక్షకులతో పాటు ఇతర దేశాల ప్రేక్షకులకు ఇండియన్ సినిమాలు దగ్గరవుతున్నాయి. అదే హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కితే ప్రపంచస్థాయి గుర్తింపు రావడం చాలా సులభం. అయితే, అదేమీ అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే అక్కడ పోటీకూడా ప్రపంచస్థాయిలోనే ఉంటుంది. అందుకే ఒక విధంగా మన నటులకు హాలీవుడ్ లో నటించాలనేది ఒక డ్రీం. కానీ అలాంటి హాలీవుడ్ సినిమాలలో అవకాశం వచ్చినా వదులుకున్న నటులు కూడా ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో కొందరు స్టార్ యాక్టర్స్ కు హాలీవుడ్ సినిమాలలో అవకాశం వచ్చినా వివిధ కారణాల వలన వదులుకోవాల్సి వచ్చింది. వారిలో కొందరిని ఇప్పుడు చూద్దాం..

1. Govinda

Bollywood Bigstars

బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కామెడీకి రారాజుగా గోవింద ఏకఛత్రాధిపత్యం చెలాయించాడు. అలాంటి సమయంలో గోవిందాకు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార్ లో నటించే అవకాశం దక్కింది. కానీ.. అప్పుడు ఆ అవకాశాన్ని గోవిందా వినియోగించుకోలేకపోయాడు. ఓ ఇంటర్వ్యూలో గోవిందా ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చాడు.

2. Shah Rukh Khan

Bollywood Bigstars

డానీ బాయిల్ తెరకెక్కించిన స్లమ్‌డాగ్ మిలియనీర్‌ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇందులో రియాలిటీ షో హోస్ట్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ నటించాడు. ఈ పాత్రకు అనిల్ ఇంటర్నేషనల్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. నిజానికి ఈ పాత్ర షారుఖ్ ఖాన్ నటించాల్సింది. షారుక్ ఈ పాత్రను అంగీకరించి కొంత ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆ తరువాత షారూఖ్ ఖాన్ ఈ కారణాన్ని బహిరంగంగా చెప్పకుండా ఆ క్రేజీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. 2010లో జోనాథన్ రాస్‌తో జరిగిన టాక్ షోలో షారుఖ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. తాను అప్పటికే అలాంటి పాత్ర చేసి ఉండడం వలన ప్రేక్షకులు తనను యాక్సెప్ట్ చేయరనే కారణంగానే తప్పుకున్నట్లు షారుక్ చెప్పాడు.

3. Deepika Padukone

Bollywood Bigstars

కన్నడ భామ దీపికా పడుకొనే భాషతో సంబంధం లేకుండా మన దేశంలో సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో హీరోలతో సమానంగా క్రేజ్ దక్కించుకున్న కొద్దిమంది హీరోయిన్స్ లో దీపికా ముందువరసలో ఉంటుంది. కానీ, ప్రపంచ స్థాయి తెర మీద అది కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ సిరీస్ లో అవకాశం వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ 7లో దీపికా నటించాల్సింది. కానీ అప్పుడు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ లీలాలో నటిస్తున్న కారణంగా ఆ ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ఇష్టంలేక దీపికా హాలీవుడ్ అవకాశాన్ని వదులుకుంది. ఆ తర్వాత విన్ డీజిల్ యొక్క XXX: ది రిటర్న్ ఆఫ్ క్జాండర్ కేజ్‌లో దీపికా హాలీవుడ్ డ్రీం నెరవేర్చుకుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ వదులుకుకున్నా బాధలేదని రామ్ లీలా లాంటి సినిమా కోసం వదులుకున్నందుకు సంతోషపడ్డానని ఓ ఇంటర్వ్యూలో దీపికా చెప్పుకొచ్చింది.

4. Naseeruddin Shah

Bollywood Bigstars

నసీరుద్దీన్ షా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మన ప్రకాష్ రాజ్ లాంటి ఎందరో విలక్షణ నటులకు నసీరుద్దీన్ షా రోల్ మోడల్. అలాంటి నసీరుద్దీన్ షాకు హాలీవుడ్ అఫర్ పట్టడం పెద్ద కష్టం కాదు. కానీ, తనను వెతుక్కుంటూ వచ్చిన హాలీవుడ్ భారీ ఆఫర్ ను కూడా షా తిరస్కరించాడు. హ్యారీ పోట్టర్ సినిమా సిరీస్ చుసిన వాళ్ళు రిచర్ హారిస్ పోషించిన డంబుల్డోర్ పాత్ర గురించి మర్చిపోలేరు. అయితే, మొదటి రెండు భాగాల తర్వాత హ్యారిస్ మరణించాడు. ఆ తర్వాత ఆ పాత్ర కోసం నసీరుద్దీన్ షాను సంప్రదించారు. ముందుగా ఈ పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వాలని కోరినా నసీరుద్దీన్ షా ఖరాకండిగా ఇవ్వలేనని చెప్పేశాడు. అందుకు కారణం కూడా నసీరుద్దీన్ చెప్పలేదు.

5. Irrfan Khan

Bollywood Bigstars

ఇర్ఫాన్ ఖాన్ చాలా హాలీవుడ్ సినిమాలలో నటించాడు. కానీ అతను తిరస్కరించినవి కూడా ఉన్నాయి. అలా ఇర్ఫాన్ కాదనుకున్న వాటిలో స్టీవెన్ స్పీల్బర్గ్ ఇంటర్ స్టెల్లెర్ కూడా ఒకటి. ఈ సినిమాలో తనకు తగినంత స్కోప్ ఇవ్వలేదని.. ముందు అనుకున్న పాత్రలో మార్పులు చేశారనే వదులుకున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ తర్వాత బాడీ ఆఫ్ లైస్, ఇంటర్‌స్టెల్లార్, ది మార్టిన్ కూడా పలుకారణాలతో ఇర్ఫాన్ వదులుకున్నాడు.

6. Aishwarya Rai

Bollywood Bigstars

మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ స్టార్ డమ్ గురించి పరిచయం అవసరం లేదు. ఐష్ కేవలం ప్రముఖ బాలీవుడ్ నటి మాత్రమే కాదు హాలీవుడ్ లోనూ తన పేరు ఫేమస్. ప్రతి సంవత్సరం కేన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్య హంస నడకల గురించి చెప్పాల్సిన పనే లేదు. గురిందర్ చద్ధా రొమాంటిక్ డ్రామా `బ్రైడ్ అండ్ ప్రిజూడీస్`తో ఐశ్వర్య తన హాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఐష్ ది మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ది పింక్ పాంథర్ 2, ది లాస్ట్ లెజియన్ సహా కొన్ని ఆంగ్ల చిత్రాల్లోనూ మెరిసింది. అయితే, ఐష్ కూడా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను వదులుకున్నారు. వాటిలో హిస్టారికల్ వార్ ఫిల్మ్ ట్రోయ్ కూడా ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సినిమాలో డైనా క్రూగర్ నటించిన పాత్రను మన ఐష్ చేయాల్సి ఉన్నా వదులుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు