Ott
OTT Release: ఈ వారం భీమ్లా నాయక్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నా ఓటీటీలో మాత్రం గ్రాండ్ కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఓటీటీలలో విడుదల అవుతున్న సినిమాపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండడంతో అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో దూసుకొస్తున్నాయి. ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతున్నాయి.
OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా నటంచిన చిత్రం సెహరి విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. హాలీవుడ్ సినిమా ద ప్రాటేష్, హిందీ సిరీస్ ద ఫేమ్ గేమ్, వెబ్ సిరీస్ వైకింగ్స్:వాల్దా, వెబ్ సిరీస్ థి జువైనల్ జస్టిస్, హాలీవుడ్ మూవీ ఏ మాడియా హోమ్ కమింగ్ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Aha OTT: తమిళంలో కూడా ఆహా.. గ్రాండ్‌గా లాంచింగ్!
వెబ్ సిరీస్ స్టార్ వార్స్ ఒబీ-వాన్ కెనోబి ఫిబ్రవరి 25వ తేదీ నుంచి డిస్నీ- హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ సినిమా లవ్ హాస్టల్ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం మూవీ అజగజాంతరం, వెబ్ సిరీస్ ఏ డిస్కవరీ ఆఫ్ విచెస్ ఫిబ్రవరి 25వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సినిమాలు.. బ్లాక్ బస్టర్ సినిమాలు ఈ వారం పెద్దగా లేకపోయినా ఓటీటీ లవర్స్ ఇష్టపడే వెబ్ సిరీస్లు, బాలీవుడ్, హిందీ సినిమాలు మాత్రం భారీగానే ఉన్నాయి.