Talented Actors : మూడు పదులకే మోత మోగిస్తున్నారు.. యూత్‌కి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తున్నారు..

టాలీవుడ్ రౌడీ స్టార్, యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తో గుర్తింపు తెచ్చుకుని, రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి, కేవలం కామెడీ అనే కాకుండా చేసే క్యారెక్టర్ ఏదైనా తమ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ నలుగురి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఒకటుంది..

Talented Actors : మూడు పదులకే మోత మోగిస్తున్నారు.. యూత్‌కి ఇన్సిపిరేషన్‌గా నిలుస్తున్నారు..

These Talented Actors Inspiration For Youth

Updated On : March 16, 2021 / 7:59 PM IST

Talented Actors: టాలీవుడ్ రౌడీ స్టార్, యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తో గుర్తింపు తెచ్చుకుని, రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి, కేవలం కామెడీ అనే కాకుండా చేసే క్యారెక్టర్ ఏదైనా తమ యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఈ నలుగురి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఒకటుంది..

Vijay Deverakonda

అదేంటంటే వీరందరూ కూడా జస్ట్ 30 ఏజ్ గ్రూప్ వాళ్లే.. చాలా కాలంగా తామనుకున్న కెరీర్‌ని పొందడానికి, నటులుగా ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ.. తమకంటూ సొంత ఐడెంటిటీని తెచ్చుకున్నారు. ‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీతగోవిందం’ తో టాప్ స్టార్‌‌గా ఎదిగిన విజయ్ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ చేస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ లో చిన్న క్యారెక్టర్ చేసినా ‘ఏజెంట్’ తో ఆకట్టుకుని ఇప్పుడు ‘జాతిరత్నాలు’ తో బిగ్ బ్రేక్ అందుకున్నాడు.

Naveen Polishetty

ప్రియదర్శి పలు సినిమాల్లో తన మార్క్ కామెడీతో ఆకట్టుకుంటూ.. ‘మల్లేశం’ వంటి మూవీతో తన టాలెంట్ మరోసారి నిరూపించుకున్నాడు. ఇక రాహుల్ అయితే కామెడీ, సీరియస్ ఏదైనా సరే తన స్టైల్లో దాన్ని పండిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కష్టపడి తాము ఇష్టపడ్డ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతూ ఎంతోమంది యువతకి ఇన్సిపిరేషన్‌గా నిలిచారు ఈ నలుగురు టాలెంటెడ్ యాక్టర్స్..

Talented Actors