బోల్డ్ మూవీస్, స్టేట్‌మెంట్స్‌తో సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాల కోసం పూణే నుంచి ముంబైకి మకాం మార్చుదాం అని నిర్ణయం తీసుకుంటే..చాలా మంది వ్యతిరేకించారని, అక్కడకు వెళితే..అత్యాచారం చేస్తారని చెప్పారని వెల్లడించారు. చాలా మంది బాలీవుడ్ గురంచి నెగటివ్ గానే చెప్పారని, బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఇదే జరుగుతోందని చెప్పారని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
విలక్షణ పాత్రలు వేస్తూ..తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి మాట్లాడారు. సినిమాల్లో నటించడానికి ముంబైకి వెళ్లాలని అనుకున్న సమయంలో బాలీవుడ్ గురించి అందరూ చెడుగా చెప్పారని తెలిపారు. అయితే..సినీ పరిశ్రమలో జరిగే విషయాలపై ప్రజలకు సదాభిప్రాయం లేదన్నారు. బాలీవుడ్ లో జరిగే అతి విషయాలపై మాత్రమే మాట్లాడుతారని, మనమంతా మనుషులమేనని అర్థం చేసుకోవాలన్నారు.
ఈమెది వైద్యుల కుటుంబం. అయితే..ఈ రంగాన్ని ఎంచుకోలేదు. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ..స్టేజీ ఆర్టిస్టుగా చేసి శభాష్ అనిపించుకుంది. మరాఠీ, హందీ సినిమాల్లో నటించింది. తన బోల్డ్ నెస్ మాటలు, స్టన్నింగ్ ఫొటోలతో ఆకర్షించింది. రక్త చరిత్ర, రక్త చరిత్ర – 2, లెజెండ్, లయన్, కబాలి లాంటి తెలుగు సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.