Thieves stole an expensive car from Shilpa Shetty restaurant
Shilpa Shetty : బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి కేవలం సినిమాలే కాకుండా పలు వ్యాపార రంగాల్లో కూడా కొనసాగుతున్నారు. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆమె రెస్టారెంట్స్ నడుపుతున్నారు. అయితే తాజాగా ఆమె నడుపుతున్న ఓ రెస్టారెంట్ బేస్మెంట్ నుండి ఖరీదైన కార్ దొంగతనం జరిగింది.
అసలేం జరిగిందంటే.. బాంద్రాకి చెందిన రుహాన్ ఖాన్ అనే ఓ పెద్ద వ్యాపారవేత్త తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి శిల్పాశెట్టి హోటల్ కి వచ్చి తన కార్ ను అక్కడున్న వ్యాలెట్ పార్కింగ్ కి ఇచ్చి, వెళ్లి తన స్నేహితులతో కలిసి భోజనం చేసి వచ్చి చూస్తే అక్కడ కార్ లేదు. దీంతో కార్ దొంగతనం జరిగిందని గుర్తించిన సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చూసారు.
ఇక ఆ ఫుటేజ్ లో రుహాన్ ఖాన్ BMW కార్ ను గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు ఎవరో అపహరించినట్లు తెలుసుకున్నారు. కార్ లాక్ తియ్యడానికి హ్యాకింగ్ పద్దతిని పాటించారట. అయితే ఈ కార్ ధర దాదాపుగా 80 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసారు. దీంతో బాలీవుడ్ స్టార్ అయిన శిల్పా శెట్టి రెస్టారెంట్ లో కనీస భద్రత కూడా లేదు అంటూ ఖాన్ మండిపడుతున్నారు.