Ram Charan : చరణ్ RC16 లుక్ అదిరిందిగా.. ఏఎన్నార్ ఈవెంట్లో చరణ్ ఫోటోలు వైరల్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

తాజాగా రామ్ చరణ్ ఏఎన్నార్ నేషనల్ అవార్డు ఈవెంట్ కు హాజరవ్వగా ఈ ఈవెంట్లో రామ్ చరణ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Ram Charan : చరణ్ RC16 లుక్ అదిరిందిగా.. ఏఎన్నార్ ఈవెంట్లో చరణ్ ఫోటోలు వైరల్.. బుచ్చిబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

Ram Charan RC 16 Look Photos goes Viral from ANR National Award Event

Updated On : October 29, 2024 / 9:09 AM IST

Ram Charan : రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత RC16 బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ ఈ సినిమా లుక్ కోసం కష్టపడుతున్నాడు. RC16 విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రా & రస్టిక్ గా ఉంటుందని గతంలోనే బుచ్చిబాబు చెప్పాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also Read : Chiranjeevi – Amitabh : చిరంజీవి కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా.. ఆ సినిమా చేసిన అమితాబ్ బచ్చన్..

గతంలో రంగస్థలం సినిమాలో చరణ్ రస్టిక్ లుక్ లో విలేజ్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాతో అదరగొట్టి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ చరణ్ విలేజ్ బ్యాక్ డ్రాప్, రస్టిక్ లుక్ అనడంతో ఈ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్ ఈ సినిమా కోసం బాడీని మరింత ఫిట్ గా చేసి, ఫుల్ గడ్డం పెంచుతున్నాడు. రంగస్థలం కంటే కూడా మరింత రస్టిక్ లుక్ లోకి మారుతున్నాడు.

Ram Charan RC 16 Look Photos goes Viral from ANR National Award Event

తాజాగా రామ్ చరణ్ ఏఎన్నార్ నేషనల్ అవార్డు ఈవెంట్ కు హాజరవ్వగా ఈ ఈవెంట్లో రామ్ చరణ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. చరణ్ బ్లాక్ సూట్ లో కళ్ళజోడు పెట్టుకొని ఫుల్ గడ్డంతో మాస్ లుక్ లో ఉన్నాడు. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్, నెటిజన్లు చరణ్ RC16 లుక్ అదిరిందిగా, బుచ్చిబాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఇక RC16 సినిమా ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తయినది, మూడు పాటలు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా షూట్ మొదలుపెట్టనున్నారు.

Ram Charan RC 16 Look Photos goes Viral from ANR National Award Event