Chiranjeevi – Amitabh : చిరంజీవి కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా.. ఆ సినిమా చేసిన అమితాబ్ బచ్చన్..
చిరంజీవి అమితాబ్ బచ్చన్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిపారు చిరంజీవి.

Amitabh Bachchan acted a Role in Megastar Chiranjeevi Movie Without Remuneration
Chiranjeevi – Amitabh : ఈ సంవత్సరం ఏఎన్నార్ నేషనల్ అవార్డుని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అక్కినేని ఫ్యామిలీ సమక్షంలో అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి ఈ అవార్డును అందించారు. ఈ ఈవెంట్ కు అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిరంజీవి అమితాబ్ బచ్చన్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిపారు చిరంజీవి.
Also Read : Chiranjeevi : నాన్న నన్ను ఎందుకు పొగడరు అని బాధపడేవాడ్ని.. మా అమ్మను అడిగితే..
చిరంజీవి మాట్లాడుతూ.. అమితాబచ్చన్ గారు నా సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయన్ని ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే సినిమాలో క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత పారితోషికం గురించి అడిగాను. దాంతో ఆయన.. నీమీద ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు అని అన్నారు. దాన్ని నేను ఎప్పటికి మరిచిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.